Russian Gold : రష్యా బంగారంపై నిషేధం?

రష్యా బంగారాన్ని నిషేధించిన జాబితాలో జీ-7 దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ కూడా చేరాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సూచించారు. బంగారం ఎగుమతుల నుంచి రష్యాకు పదుల బిలియన్ల డాలర్లు ఆదాయం సమకూరుతోంది.

Russian Gold : రష్యా బంగారంపై నిషేధం?

Gold

bans on Russian gold : రష్యా బంగారంపై యూకే, అమెరికా, కెనడా, జపాన్‌లు నిషేధం విధించనున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధంలో ఖర్చుచేసేందుకు రష్యా వద్ద నిధులు లేకుండా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయంతీసుకొన్నారు. ఇది పుతిన్‌ యుద్ధ వనరులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని యూకే తెలిపింది. 2021లో రష్యా 15.4 బిలియన్‌ డాలర్ల విలువైన స్వర్ణాన్ని ఎగుమతి చేసింది. యుద్ధం ప్రారంభం కావడంతో రష్యా సంపన్నులు దీని కొనుగోళ్లను గణనీయంగా పెంచారు.

రష్యా బంగారాన్ని నిషేధించిన జాబితాలో జీ-7 దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ కూడా చేరాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సూచించారు. బంగారం ఎగుమతుల నుంచి రష్యాకు పదుల బిలియన్ల డాలర్లు ఆదాయం సమకూరుతోంది. రష్యా నుంచి బంగారం దిగుమతులను నిషేధించినట్లు జీ-7 దేశాలు సమష్టిగా ప్రకటించాలి అని బైడెన్‌ ట్విటర్‌లో కోరారు. బైడెన్‌కు మద్దతుగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ స్వరం కలిపారు. పుతిన్‌ యుద్ధ నిధులను అడుగంటేలా చేయాలని… యూకే, మిత్రపక్షాలు ఇప్పుడదే చేస్తున్నాయని తెలిపారు.

Russian: పుతిన్ వ్యూహం సక్సెస్ అయిందా? పలు దేశాలు ఆంక్షలు విధించినా రష్యా కరెన్సీ విలువ ఎలా పెరుగుతోంది..

లండన్‌ అతిపెద్ద గోల్డ్‌ ట్రేడింగ్‌ మార్కెట్లలో ఒకటి. తాజాగా యూకే మిత్రదేశాల చర్యలతో రష్యాకు నిధుల సమీకరణ కష్టం కానుంది. ఇప్పటికే అమెరికా, యూకే, ఐరోపా సమాఖ్యలు కలిపి దాదాపు 1,000 మంది రష్యా సంపన్నులు, అధికారులు, సంస్థలపై ఆంక్షలు విధించింది. తాజా చర్యతో రష్యా లభించే 13.5 బిలియన్‌ డాలర్ల ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపనుంది. యూకే పార్లమెంట్‌లో బిల్లును ఆమోదింపజేస్తే.. ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయి.