Russian: పుతిన్ వ్యూహం సక్సెస్ అయిందా? పలు దేశాలు ఆంక్షలు విధించినా రష్యా కరెన్సీ విలువ ఎలా పెరుగుతోంది..

రష్యా, యుక్రెయిన్ దేశాల మధ్య వార్ జరుగుతూనే ఉంది. యుక్రెయిన్ పై బాంబుల దాడితో రష్యా సైన్యం విరుచుకు పడుతుంది. ప్రధాన నగరాలు రష్యా సైన్యం చేతుల్లోకొచ్చాయి. మూడు నెలలుగా ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. అయితే యుక్రెయిన్ పై రష్యా దాడులను అమెరికాతో సహా అనేక దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి..

Russian: పుతిన్ వ్యూహం సక్సెస్ అయిందా? పలు దేశాలు ఆంక్షలు విధించినా రష్యా కరెన్సీ విలువ ఎలా పెరుగుతోంది..

Russia (1)

Russian: రష్యా, యుక్రెయిన్ దేశాల మధ్య వార్ జరుగుతూనే ఉంది. యుక్రెయిన్ పై బాంబుల దాడితో రష్యా సైన్యం విరుచుకు పడుతుంది. ప్రధాన నగరాలు రష్యా సైన్యం చేతుల్లోకొచ్చాయి. మూడు నెలలుగా ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. అయితే యుక్రెయిన్ పై రష్యా దాడులను అమెరికాతో సహా అనేక దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. రష్యాను కట్టడిచేసేందుకు ఆ దేశం నుంచి ఎలాంటి వ్యాపార లాదేవీలు పెట్టుకోవద్దని తీర్మాణాలు చేస్తున్నాయి. అయినా డాలర్ తో మారకపు విలువలో ప్రపంచంలోనే అత్యుత్తమంగా మెరుగపడుతున్న కరెన్సీగా రష్యా రూబుల్ నిలుస్తోంది. రష్యాపై ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ రూబుల్ ఏ విధంగా బలపడుతోందన్న ప్రశ్న ప్రతిఒక్కరి నుంచి వ్యక్తమవుతుంది.

Russian Oil Depot : యుక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా ఆయిల్ డిపో ధ్వంసం.. భారీగా మంటలు.. వీడియో వైరల్

యుక్రెయిన్ పై యుద్ధంతో అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, న్యూజీల్యాండ్ తో పాటు పశ్చిమ దేశాలు రష్యాపై అక్షలు విధించాయి. రష్యా నుంచి ఎలాంటి వ్యాపార లావాదేవీలు పెట్టుకోమని, రష్యాకు ఏ విధమైన సహకారం అందించేది లేదని పలు దేశాలు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో రష్యా రూబుల్ విలువ పడిపోవటం ఖాయమని, ఇక ఆ దేశం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని వార్తలొచ్చాయి. కానీ పుతిన్ వ్యూహం రష్యా వ్యతిరేఖ దేశాల అంచనాలను తలకిందులు చేస్తున్నాయి. రూబుల్ నానాటికి బలపడుతుండటంతో పశ్చిమ దేశాల ఆంక్షలు రష్యాపై ప్రభావం చూపలేక పోతున్నాయనే వాదన వినిపిస్తోంది. మార్చి 7న రికార్డు స్థాయిలో ఒక డాలరుకు రూబుల్ విలువ 0.007కు పడిపోయింది. అయితే ఆ తరువాత 15శాతం వరకు మారకపు విలువ మెరుగుపడింది. ప్రస్తుతం ఇది 0.016కు పెరిగింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ పకడ్బందీ వ్యూహంతోనే ఇది సాధ్యమైనట్లు తెలుస్తోంది.

Russia warns USA: యుక్రెయిన్‌కు హైటెక్ ఆయుధాల సరఫరా పై అమెరికాకు రష్యా తీవ్ర హెచ్చరిక

రష్యా నుంచి యూరోపియన్ దేశాలు చమురు, సహజ వాయువులను కొనుగోలు చేస్తాయి. గతంలో డాలర్లు, యారోల్లో లావాదేవీలు జరిగేవి. కానీ ప్రస్తుతం వీటిపై పుతిన్ ఆంక్షలు విధించారు. చమురు, సహజ వాయువులను కొనుగోలు చేయాలంటే రూబుల్ లోనే చెల్లించాలని స్పష్టం చేశారు. కొన్ని దేశాలు అంగీకరించకపోయినా కొన్ని దేశాలు రష్యా ఆంక్షలకు ఓకే చెప్పాయి. రష్యా ప్రభుత్వ సంస్థ గ్యాజ్‌ప్రోమ్ నుంచి భారీగా గ్యాస్‌ను కొనుగోలు చేస్తున్న దేశాల్లో జర్మనీ ఒకటి. రూబుల్‌లోనే లావాదేవీలు జరపాలన్న ఆంక్షలకు ఇప్పటికే జర్మనీ అంగీకారం తెలిపింది. మొత్తానికి ఈ చర్య వల్ల రష్యా లాభపడుతోందనేది ఆర్థిక విశ్లేషకుల మాట. అయితే ఈ విధానం రష్యాకు తాత్కాలిక ఉపశమనాన్నే కలిగిస్తుందని, ఇదే వ్యూహాన్ని పుతిన్ ధీర్ఘకాలం అమలు చేస్తే రష్యా ఆర్థిక వ్యవస్థకే ముప్పు వాటిల్లే అవకాశాలు ఎక్కువ అన్నది నిపుణుల మాట.