World Most Expensive City: బా..గా… డబ్బున్న వాళ్లకు మాత్రమే ఈ ప్రత్యేకమైన సిటీ 

ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ సిటీ ఏంటో తెలుసా.. ఏ ప్యారిసో.. సింగపూరో అనుకుంటున్నారా కానే కాదు. రీసెంట్ గా జరిగిన సర్వేలో.. తేల్ అవివ్ అనే ఇజ్రాయెల్ సిటీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన..

World Most Expensive City: బా..గా… డబ్బున్న వాళ్లకు మాత్రమే ఈ ప్రత్యేకమైన సిటీ 

Expensive City

World Most Expensive City: ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ సిటీ ఏంటో తెలుసా.. ఏ ప్యారిసో.. సింగపూరో అనుకుంటున్నారా కానే కాదు. రీసెంట్ గా జరిగిన సర్వేలో.. టెల్ అవివ్ అనే ఇజ్రాయెల్ సిటీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సిటీగా తేల్చింది ఎకానమిస్ట్ ఇంటిలిజెన్స్ యూనిట్.

వరల్డ్‌వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ లో భాగంగా.. 173సిటీలలో వస్తువుల కొనుగోలు, సేవలు గురించి చేసే ఖర్చులో యూఎస్ డాలర్స్ ఎంతమేర ఖర్చుపెట్టాల్సి వస్తుందోనని పరిశీలించారు. అందులో టెల్ అవివ్ నేషనల్ కరెన్సీ, షెకెల్ అంశాల్లో టాప్ పొజిషన్ కు చేరుకుంది. అంతేకాకుండా ట్రాన్స్‌పోర్ట్, గ్రోసరీస్ అంశంలోనూ ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందట.

ఈ సిటీ తర్వాతి ప్లేస్‌లో ప్యారిస్, సింగపూర్ జాయింట్ గా రెండో పొజిషన్ లో నిలిచాయట. ఆ తర్వాత జ్యూరిచ్, హాంకాంగ్ లు ఉండగా న్యూయార్క్ ఆరో ప్లేస్, జెనీవా ఏడో పొజిషన్, కొపొనెహగెన్ ఎనిమిదో స్థానంలో, లాస్ ఏంజిల్స్ తొమ్మిది, జపాన్ పదో ప్లేసుల్లో ఉన్నాయట.

……………………………………… : సిరివెన్నెలకి.. ఆ జిల్లాకి.. విడదీయలేని బంధం

గతేడాది జరిపిన సర్వేలో ప్యారిస్, జ్యూరిచ్, హాంకాంగ్ లు కలిసి ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నాయి.

ఈ ఏడాది ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో కమొడిటీల ధర పెరగడంతో లోకల్ వస్తువుల ధరలు సైతం 3.5శాతం పెరిగాయట. గత ఐదేళ్ల కంటే వేగంగా నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి.

ఇరాన్ రాజధాని నగరమైన టెహ్రాన్ 79వ స్థానం నుంచి 29వ స్థానానికి చేరుకోగలిగింది. వరల్డ్ చీపెస్ట్ సిటీగా సిరియాలోని దమస్కస్ నిలిచింది.

……………………………………….. : సెల్ఫీ తీసుకుని స్కూటర్ స్టార్ట్ చేసుకోవచ్చు