New Zealand : ‘మేం లాబరేటరీలో ఎలుకలం కాదు..ఆ నాటి స్వేచ్ఛ మాక్కావాలి’ : పార్లమెంటు భవనాన్ని చుట్టుముట్టిన నిరసనకారులు

లాక్ డౌన్ వద్దు, వ్యాక్సిన్ వేయించుకోమని నిర్భంధించవద్దు..ఈ నిబంధనలు మాకు అవసరంల లేదు. మాకు స్వేచ్ఛ కావాలి అంటూ న్యూజిలాండ్ లో నిరసనకారులు పార్లమెంట్ ను చుట్టుముట్టారు.

New Zealand : ‘మేం లాబరేటరీలో ఎలుకలం కాదు..ఆ నాటి స్వేచ్ఛ మాక్కావాలి’ : పార్లమెంటు భవనాన్ని చుట్టుముట్టిన నిరసనకారులు

Protest In New Zealand Against Covid 19 Vaccine Mandate (1)

Protest In New Zealand Against COVID-19 Vaccine  : కరోనాను కట్టడి చేయటంలో న్యూజిలాండ్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. కరోనాను సమర్థంగా కట్టడి చేయటానికి ప్రధాని జెసిండ్ అర్డెర్న్ కట్టుదిట్టమైన చర్యలుతీసుకుని కంట్రోల్ చేసి శెభాష్ అనిపించుకున్నారు. దీని కోసం ప్రధాని కఠిన నిర్ణయాలు తీసుకోవటం వల్లే ఇది సాధ్యమైంది. కరోనాను అద్భుతంగా కట్టడి చేసిన న్యూజిలాండ్ ఈసారి మాత్రం డెల్టా వేరియంట్ దెబ్బకు కాస్తంత ఇబ్బంది పడుతోంది. దీంతో లాక్‌డౌన్‌ల ద్వారా మరోసారి కరోనా మహమ్మారిని నిర్మూలించాలని భావించిన ప్రధాని జసిండా ఆర్డెర్న్ కఠిన ఆంక్షలు విధించడంతోపాటు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టీకా తీసుకోవాలని ఆదేశించారు.

వ్యాక్సిన్ తప్పనిసరి అనటం చాలామంది ప్రజలు ఇది నచ్చలేదు. నిర్భంధ వ్యాక్సినేషన్ అనేది మేం ఒప్పుకునేది లేదని..వ్యాక్సిన్ వేయించుకోవాలా? వద్దా?అనేది వారి వారి నిర్ణయాలని బలవంతంగా వ్యాక్సిన వేయటం సరికాదంటున్నారు. అంతేకాదు బలవంతంగా వ్యాక్సిన్ వేయటానికి మేం మీ ప్రయోజశాలలో ఎలుకలం కాదంటూ మాకు స్వేచ్ఛ కావాలి అంటూ పార్లమెంట్ భవనాన్ని చుట్టుముట్టి నిరసనలు తెలుపుతున్నారు. కాగా న్యూజిలాండ్ లో మంగళవారం (నవంబర్ 9,2021) 125 కొత్త కేసులు నమోదు కాగా మరోసారి కఠిన ఆంక్షల్ని అమలు చేయాలనే ప్రధాని నిర్ణయాన్ని నిరసనకారులు తప్పుపడుతున్నారు.

Read more : Corona Vaccination Fear : వ్యాక్సిన్ మాకొద్దు బాబోయ్ అంటూ…నదిలో దూకి పారిపోయిన గ్రామస్తులు

న్యూజిలాండ్ ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యల్ప COVID-19 కేసులను కలిగి ఉన్న దేశంగా గుర్తింపు పొందింది. ఇప్పటివరకు 8,000 కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. 32 మరణాలు నమోదయ్యాయి. ఈక్రమవంలో మంగళవారం 125 కొత్త కేసులను నమోదు కావటంతో మరోసారి కరోనాను ఖతం చేయటానికి తీసుకున్నే కఠిన నిర్ణయాలను చాలామంది ప్రజలు తప్పుపడుతున్నారు. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్న క్రమంలో ఇప్పటికే 80% మందికి రెండు డోసులు వేయించుకున్నవారున్నారు.

దీన్ని నూటికి నూరు శాతం పూర్తి చేయాలనే సంకల్పంతో తద్వారా కరోనాను పూర్తిగా నియంత్రించాలనే ఆలోచనతో దేశంలో కేసులు నమోదు అయిన ప్రాంతాల్లో కరోనా లాక్‌డౌన్, తప్పనిసరి వ్యాక్సినేషన్‌ జరగాలని నిర్ణయించారు ప్రధాని జెసిండా. దీన్ని వ్యతిరేకిస్తు ప్రజలు వ్యాక్సినేషన్ కు వ్యతిరేకంగా న్యూజిలాండ్‌లో వేలాదిమంది ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. పార్లమెంటు భవనం ‘బీహైవ్’ను చుట్టుముట్టారు. దీంతో పార్లమెంటు రెండు ప్రవేశ ద్వారాలు మినహా మిగిలిన అన్నింటినీ మూసివేసిన భద్రతా దళాలు, పోలీసులు భవనం ఎదుట పెద్ద ఎత్తున మోహరించారు. నిరసనకారుల్లో అత్యధికులు ఎలాంటి ముసుగులు లేకుండానే ఆందోళనకు దిగారు. పార్లమెంటు భవనం బయట నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున నిరసన తెలిపినప్పటికీ శాంతియుతంగా జరగడం గమనించాల్సిన విషయం.

Read more : Covid vaccine : నా శివయ్య కరోనా వ్యాక్సిన్ వేయించుకోవద్దని చెప్పాడు..రోడ్డుపై మహిళ వీరంగం

నిరసనకారులు ‘స్వేచ్ఛ కావాలి’, అని ‘మేం ప్రయోగశాలల్లోని ఎలుకలం కాదు’ అని రాసివున్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలన్న నిబంధనతోపాటు కరోనా కేసుల నమోదు క్రమంలో విధించిన అన్ని ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఓ నిరసనకారుడు మాట్లాడుతు..‘‘వ్యాక్సిన్ వేయించుకోవాలా? వద్దా? అనేది నా ఇష్టం. వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని నన్నెలా బలవంతం చేస్తారు? నా శరీరం కోరుకోని దానిని తీసుకోమని ఎలా చెబుతారు?’’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తు ప్రశ్నించాడు. చేశారు. మరో నిరసనకారుడు మాట్లాడుతూ… ‘‘మాకు 2018 నాటి స్వేచ్ఛ కావాలి. ప్రభుత్వం అది తెచ్చిస్తే చాలు..మాకు ఈ వ్యాక్సిన్లు మాకొద్దు. ఈ లాక్ డౌన్లను మేం ఒప్పుకోం’’ అని డిమాండ్ చేశారు.

వ్యాక్సిన్ పట్ల అవగాహ కల్పించటానికి ప్రధాని తరచు మీడియాతో మాట్లాడుతుంటారు. ఈక్రమంలో గత నెలలో మాట్లాడుతూ.. టీచర్లు, ఆరోగ్య, వైకల్య రంగాల్లో పనిచేస్తున్న వారు పూర్తిస్థాయిలో టీకాలు వేయించుకోవాల్సి ఉంటుందన్నారు. అర్హులైన 90 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యాక ఆంక్షలు తొలగిస్తామని హామీ కూడా ఇచ్చారు. దీంతో స్వేచ్ఛ కావాలంటూ కొంతమంది ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. తక్షణం ఆంక్షలను ఎత్తివేయాలని…తప్పనిసరిగా టీకా తీసుకోవాలన్న నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తు పార్లమెంటును ముట్టడించారు.

Read more : Threat vaccination staff with snake : ‘నాకు వ్యాక్సిన్ వేసారో..పాముతో కరిపిస్తా జాగ్రత్త’ : మహిళ బెదిరింపు

కాగా ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఈనాటికి కూడా కరోనా కేసులు నమోదు విషయంలో తక్కువ కేసులు నమోదవుతున్న దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి. ఇప్పటి వరకు 8 వేల కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి అంటే దానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు.అవగాహన కార్యక్రమాలే కారణం. దేశ వ్యాప్తంగా కరోనాతో 32 మంది మరణించారు.ఈ క్రమంలో నవంబర్ 9న దేశంలో 125 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో రెండు డోసులూ తీసుకున్న వారి సంఖ్య 80 శాతానికి చేరుకుంది. కానీ స్వేచ్ఛ కావాలనే ప్రజలకు కరోనాను లైట్ తీసుకోవటం సరికాదని మొదట్లోనే కట్టడి చేస్తే పూర్తి స్వేచ్ఛను అనుభవించవచ్చని ప్రభుత్వ భావిస్తోంది.