India ఉద్యోగులకు TikTok సీఈఓ స్పెషల్ మెసేజ్

India ఉద్యోగులకు TikTok సీఈఓ స్పెషల్ మెసేజ్

టిక్ టాక్ సీఈఓ ఇండియాలో పని చేస్తున్న తమ ఉద్యోగులకు లెటర్ రాశారు. ఇండియా ప్రభుత్వం తొలగించిన 59యాప్ లలో చైనీస్ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ ఒకటి. అత్యధికమైన ఎకానమీ తెచ్చిపెడుతున్న యాప్‌కు జూన్ 15 తర్వాత ఒక్కసారిగా కుదేలైంది. గల్వాన్ లోయలో అమరులైన 20 మంది సైనికుల ప్రభావం యాప్ ప స్పష్టంగా కనిపించింది.

‘టిక్ టాక్ విషయంలో మా యాప్.. ఇంటర్నెట్ లో సమానత్వాన్ని చూపించేదిలా ఉంది. ఈ ప్రయత్నంలో మేం సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం. మేం మా కమిట్‌మెంట్ పూర్తి చేయడంలో కట్టుబడే ఉన్నాం. వాటాదారులతో చర్చిస్తున్నాం. టిక్ టాక్ భారత చట్టం డేటా ప్రైవసీ.. సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్ కు అనుగుణంగానే సిద్ధం అవుతుంది’ అని టిక్ టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ బైట్ డ్యాన్స్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ కెవిన్ మేయర్ అన్నారు.

ఈ పోస్టులో కెవిన్ మేయర్.. ఇండియాలో ఉద్యోగులందరికీ ఓ మెసేజ్ అని మేయర్ అన్నారు. 2018 నుంచి కష్టపడి పనిచేసి 200 మిలియన్ యూజర్లను సంపాదించాం. ఈ క్రమంలో ఇండియా తన క్రియేటివిటీ, సంతోషాన్ని, సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్, అనుభవాలు పంచుకోవడాన్ని ఎంజాయ్ చేశారు.

మా ఉద్యోగులే మాకు పెద్ద బలం. వారి శ్రేయస్సునే ప్రాధాన్యంగా తీసుకుంటున్నాం. 2వేల మందికంటే ఎక్కువ మంది వర్క్ ఫోర్స్ తో ఏదైనా సాధింగలమని నిరూపించాం. వారి పాజిటివ్ అనుభవాలతోనే సాధించగలిగామని చెప్పడానికి గర్వపడుతున్నాం. అని టిక్ టాక్ సీఈఓ అన్నారు.

టిక్ టాక్ అనేది వందల మిలియన్లలో యూజర్లను క్రియేటివ్ వర్క్ చేసేందుకు ఆర్టిస్టులు, స్టోరీ టెల్లర్లు, ఎడ్యుకేటర్లు, పర్‌ఫార్మార్లకు టిక్ టాక్ సాయపడింది. ప్రపంచవ్యాప్తంగా వారి స్కిల్స్ పంచుకోవడానికి తోడ్పడింది. బ్రాండ్ ప్రమోషన్లు, అసోసియేషన్స్ లకు మాత్రమే కాకుండా సినిమా స్టార్లు, స్పోర్ట్స్ సెలబ్రిటీలకు డొమైన్ గా మారిపోయింది. మారుమూల పల్లెటూళ్లలో, పట్టణాలు, నగరాల్లో టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసిందని కెవిన్ మేయర్ అన్నారు.

Read:రహస్యంగా యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేస్తున్న TikTok