Rs 100 Home : రూ. 2 కోట్ల విలువైన ఇల్లు రూ.100కే అమ్మకం.. దంపతుల పెద్దమనస్సులో ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాల్సిందే..!

రూ. 2 కోట్ల విలువైన ఇంటిని రూ. 100కే అమ్మకానికి పెట్టారు భార్యాభర్తలు. దాని కోసం లాటరీ టిక్కెట్లు అమ్ముతున్నారు. ఇల్లు అమ్మకానికి లాటరీ టిక్కెట్లు అమ్మటానికి సంబంధమేంటంటే..

Rs 100 Home : రూ. 2 కోట్ల విలువైన ఇల్లు రూ.100కే అమ్మకం.. దంపతుల పెద్దమనస్సులో ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాల్సిందే..!

Uk Couple Giving Away Rs 2 Crore Home For Just Rs 100 To Lucky Winner (1)

Couple Giving Away Rs 2 Crore Home for Just Rs 100 to Lucky Winner కష్టాల్లో ఉండేవారికి తమ శక్తిమేరకు సహాయం చేసేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఓ దంపతులు మాత్రం ఏకంగా కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తిని కేవలం రూ.100లకే ఇచ్చేశారు. మానసిక వికలాంగ పిల్లల కోసం యూకేకు చెందిన దంపతులు పెద్ద మనస్సును చాటుకున్నారు. యూకేకి చెందిన ఆడమ్ త్వైట్స్, లిజ్ భార్యాభర్తలు. వారికి ఎమిలీ అనే ఓ కూతురు ఉంది. వీళ్లు ముగ్గురు ఇంగ్లండ్‌లోని సౌత్‌ టైన్‌సైడ్ ఉంటున్నారు. లిజ్‌..మానసిక వైకల్యంతో ఉన్న పిల్లల కోసం ఏర్పడిన గ్రేస్‌ హౌస్‌ అనే చారిటీ సంస్థలో పని చేస్తుంది. ఈ పిల్లలకు వారి పనులు వారు చేసుకునేలా ట్రైనింగ్ ఇవ్వటం..అటువంటి పిల్లలతో ఎలా ఉండాలి?అనే వాటి ఆ పిల్లలు తల్లిదండ్రులకు ట్రైనింగ్ ఇస్తుంటుంది.అటువంటి పిల్లల కోసం రకాల గేమ్స్‌ రూపొందిస్తుంది. పిల్లలు ఆ ఆటలు ఆడేలా నేర్పుతుంది. చాలా ఓపికగా వారి కోసం రోజులో ఎక్కవగా గడుపుతుంటుంది. అటువంటి పిల్లల కోసం ఎంతో శ్రమ పడుతుంటుంది లిజ్. ఆ పిల్లల్ని చూస్తే మనస్సు చలించిపోతుందని..ఏం పాపం చేశారని ఈ పిల్లలకు ఇటువంటి బాధలు అంటూ ఆవేదన వ్యక్తంచేస్తుంది లిజ్.

Read more : Villagers Crazy problem : ఈ పురోహితుడు మాకొద్దు అంటూ గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం..

అలా ఓసారి గ్రేస్‌ హౌస్‌ కు మానసిక వికలాంగ పిల్లలతో గడుపుతున్న భార్య దగ్గరకు వచ్చాడు ఆడమ్. అక్కడ రిజిస్టర్డ్ మేనేజర్‌ని వీల్‌చైర్ యాక్సెస్ చేయగల ఊయల అవసరం గురించి అడిగాడు. దాని ధర 13 వేల పౌండ్లు అంటే మన కరెన్సీలో 12,98,074.18 రూపాయలు అని చెప్పటతో ఆశ్చర్యపోయాడు ఆడమ్.నా కూతురు ఎమిలీకి ఈ ఊయల అంటే చాలా ఇష్టం అని ఆడమ్‌ గుర్తు చేసుకున్నాడు ఆడమ్. అయితే ఎమిలీలానే అందరి పిల్లలకు ఊయల ఊగే అవకాశం ఉండకపోవచ్చు కదా? అని అనుకున్నాడు. ఆ తలపే ఆమడ్ ను కలచి వేసింది. అటువంటి పిల్లల కోసం ఏదైనా చేయాలి అని అనుకున్నాడు.

దాని గురించే ఆలోచిస్తున్న ఆడమ్‌కు ఓ ఆలోచన వచ్చింది. అదే విషయం భార్య లిజ్ కు చెప్పాడు. ఆమె చాలా సంతోషంగా ఒప్పుకుంది. అలా ఆ దంపతులు ఒకేలా ఆలోచించారు. తమకున్న ఓ ఇంటిని మానసిక వికలాంగ పిల్లల కోసం తమకున్న రూ.2 కోట్ల రూపాయలు ఖరీదు చేసే వారి ఇంటిని కేవలం రూ.100 అమ్మాలని నిర్ణయించారు. మూడు బెడ్రూంలు, లివింగ్‌ రూం, కార్‌ పార్కింగ్‌, గార్డెన్‌ అన్ని సౌకర్యాలు ఉన్న ఆ ఇంటిని వంద రూపాయలకే అమ్మకానికి పెట్టారు. అదేంటీ అంత ఖరీదైన ఇంటిని అమ్మగా వచ్చిన డబ్బుల్నే ఇవ్వొచ్చు కదా అనుకోవచ్చు. కానీ అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. అదే ఆడమ్,లిజ్ ల తెలివి.

Read more : Man Break Dog Legs : పిల్లాడిపై దాడి చేసిన కుక్క.. కాళ్ల‌ను నరికిన తండ్రి

ఆ ఇంటిని అమ్మడానికి ఆడమ్‌ దంపతులు 100 రూపాయలు ఖరీదు చేసే 2 లక్షల టికెట్లు ముద్రించారు. అంటే మరోరకంగా చెప్పాలంటే.. తమ ఇంటిని వారు వంద రూపాయలు విలువ చేసే లాటరీ టికెట్‌గా మార్చారు. అలా 2 లక్షల టికెట్లను ప్రింట్‌ చేసి వాటిని అమ్మటం మొదలుపెట్టారు. అంటే రెండు లక్షల మంది ఈ టికెట్లను కొంటే ఒక్క లక్కీ విన్నర్‌కి.. ఇల్లు సొంతమవుతుంది.అయితే ఇంటిని ఇలా అమ్మడం వెనక ఆడమ్‌ దంపతుల మంచి మనసు గురించి తెలుసుకున్న ఎంతోంది పోటీలు పడి మరీ ఆ టిక్కెట్లను కొనడం కోసం ఎగబడ్డారు. చాలా మంచి పని చేస్తున్నారు. మంచి ఆలోచన చేశారు అంటూ ప్రశంసిస్తున్నారు.