Covid : భారీగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు.. బ్రిటన్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. బూస్టర్లు ఇస్తున్నా..

కరోనావైరస్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. కొన్ని దేశాల్లో తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ కేసులు, మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రష్యాలో విలయతాండవం..

Covid : భారీగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు.. బ్రిటన్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. బూస్టర్లు ఇస్తున్నా..

Uk Covid

Covid : కరోనావైరస్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. కొన్ని దేశాల్లో తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ కేసులు, మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రష్యాలో కరోనా విలయతాండవం చేస్తోంది. అక్కడ ఒక్కరోజే రికార్డు స్థాయిలో వెయ్యికిపైగా కరోనా మరణాలు నమోదవడం.. మహమ్మారి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒక రష్యానే కాదు.. బ్రిటన్ లోనూ అదే సీన్ కనిపిస్తోంది. బ్రిటన్ లో మళ్లీ కరోనా పంజా విసురుతోంది.

Bra : వార్నీ.. పిచ్చ కామెడీ.. సాక్స్ ఆర్డర్ చేస్తే బ్రా వచ్చింది..

కరోనా కేసులు గణనీయంగా తగ్గడం, మెజార్టీ ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వడంతో జులైలో అక్కడి ప్రభుత్వం కొవిడ్ నిబంధనలకు గుడ్ బై చెప్పింది. మాస్కులు కూడా ధరించాల్సిన పని లేదంది. దాదాపు అన్ని రకాల వ్యవహారాలకు పర్మిషన్ ఇచ్చింది. విద్యా సంస్థలు తిరిగి తెరుచుకున్నాయి. కట్ చేస్తే.. ఇవన్నీ కలిసి కరోనా వ్యాప్తికి ఊతమిచ్చాయి. రెండు వారాలుగా 35 నుంచి 40 వేల మధ్య నమోదైన రోజువారీ కేసులు.. సోమవారం 50 వేలకు చేరువయ్యాయి. అంటే జులై నాటి గరిష్ఠానికి చేరాయన్నమాట. వేసవికాలం నుంచి తరచుగా రోజుకు 100కు పైగా మరణాలు వెలుగుచూస్తున్నాయి. మొత్తం మరణాల సంఖ్య 1.38 లక్షలకు చేరింది. మృతుల సంఖ్యలో యూరప్ లో రష్యా తర్వాతి స్థానం బ్రిటన్‌దే.

Free Wi-Fi: ఉచిత వైఫై వాడుతున్నారా? రిస్క్ చేస్తున్నట్లే.. తస్మాత్ జాగ్రత్త!!

‘ఇతర దేశాలతో పోల్చితే బ్రిటన్‌లో కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉంది. పాజిటివ్‌ కేసులు, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాలు ఎక్కువగా ఉన్నాయి’ అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జిమ్ నెయిస్మిత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆ దేశంలో శీతాకాలం సమీపించింది. ఈ సమయంలో శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండటంతో వైద్య సేవలపై భారం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మున్ముందు రోజులు వైద్య వ్యవస్థకు సవాలే అన్నారు.

విద్యార్థుల్లో పెరుగుతున్న కేసులు..
విద్యార్థుల్లో నమోదవుతున్న కరోనా కేసులే ప్రస్తుత ఉద్ధృతికి దోహదం చేస్తున్నాయని రీడింగ్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణుడు సైమన్ క్లార్క్‌ అభిప్రాయపడ్డారు. బ్రిటన్‌లో స్కూల్ కి వెళ్తున్న విద్యార్థుల్లో వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉంది. అలాగే మాస్కులు తప్పనిసరి కాదు. అయితే కేసులు పెరిగితే విద్యార్థులు మాస్కులు ధరించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. మామూలుగా ఆరోగ్యంగా ఉన్న పిల్లల విషయంలో కరోనా గురించి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. వారు ఆ వైరస్‌తో పోరాడి కోలుకోగలరు. కానీ ఇంట్లో ఉండే పెద్దలు, ఉపాధ్యాయులు, టీకా తీసుకోనివారు, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి తాజా ఉద్ధృతి ఆందోళనకరంగా మారొచ్చని సైమన్ అన్నారు.

Black Pepper : బరువును తగ్గించే బ్లాక్ పెప్పర్ వాటర్

ప్రస్తుతం అక్కడ సగటున రోజుకు ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య 900కి చేరింది. వేసవిలో 500కి పైగా ఉన్న ఆ సంఖ్య దాదాపు రెట్టింపయ్యింది. జులైలో బ్రిటన్‌ కొవిడ్ ఆంక్షలను తొలగించిన విషయం తెలిసిందే. భౌతిక దూరం, మాస్కులు, రద్దీ ప్రదేశాల్లో టీకా ధ్రువపత్రం తప్పనిసరికాదని ప్రకటించింది.

బూస్టర్లూ ఇస్తున్నారు..
బ్రిటన్ ప్రధానంగా ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకాపైనే ఆధారపడింది. అలాగే ఈ దేశం ముందుగా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాంతో టీకా యాంటీబాడీలు కనుమరుగయ్యే అవకాశం ఉందన్న ప్రశ్నలూ తలెత్తాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు 41 శాతం మంది బూస్టర్ డోసుల్ని స్వీకరించారు. అయితే ఫాలోఅప్ కార్యక్రమంపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోపక్క మాస్కులు ధరించే విషయంలో బ్రిటన్ వాసులు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. 15 శాతం మంది ప్రజలు తాము ఎన్నడూ బహిరంగంగా మాస్కులు ధరించలేదని చెప్పారు.

ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటూ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని బోరిస్ జాన్సన్ ఆర్థికవ్యవస్థ పురోగమనంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. అందుకే తిరిగి లాక్‌డౌన్, ఆంక్షలు విధించడంపై విముఖతతో ఉన్నారు. ‘మాస్కులు తప్పనిసరి చేయడం వంటి చర్యలు ఇప్పుడు అవసరంగా కనిపిస్తున్నాయి. శీతాకాలం సమీపిస్తుండటంతో మన పరిస్థితి ఏంటో సమీక్షించుకోవడం సరైందే’ అని ప్రస్తుత పరిస్థితిపై నెయిస్మిత్ సూచనలు చేశారు.