Modi and Sunak Meeting: మోదీ, సునక్ భేటీ జరిగిన కొన్నిగంటలకే యూకే కీలక నిర్ణయం.. భారత పౌరులకు గుడ్ న్యూస్

బాలిలో జరిగిన G20 సమ్మిట్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, యూకే ప్రధాని సునక్ కొద్దిసేపు పలు అంశాలపై చర్చించారు. వీరి మధ్య భేటీ జరిగిన గంటల వ్యవధిలోనే యూకే ప్రధాని కార్యాలయం కీలక నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.

Modi and Sunak Meeting: మోదీ, సునక్ భేటీ జరిగిన కొన్నిగంటలకే యూకే కీలక నిర్ణయం.. భారత పౌరులకు గుడ్ న్యూస్

UK PM and India PM

Modi and Sunak Meeting: యూకే ప్రధాన మంత్రి రిషి సునక్, భారత ప్రధాని నరేంద్ర మోదీల భేటీ జరిగిన కొద్దిగంటలకే యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ సంవత్సరం యూకేలో పనిచేయడానికి భారతదేశం నుండి యువత కోసం వీసాలు అందించే పథకానికి అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.  18–30 సంవత్సరాల వయస్సు గల డిగ్రీ విద్యావంతులైన భారతీయులు వృత్తిపరమైన, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడానికి రెండేళ్ల వరకు యూకేలో జీవించడానికి 3వేల మందికి  వీసాలను అందించనున్నారు.  ఈ విషయాన్ని యూకే ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.

UK PM Rishi Sunak : బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునక్ వల్ల భారత్‌కు మేలు జరుగుతుందా?

2023 ప్రారంభంలో ఈ పథకం అమల్లోకి వస్తుంది. ఇటువంటి పథకం నుండి ప్రయోజనం పొందిన మొదటి వీసా జాతీయ దేశం భారతదేశం కావటం గమనార్హం. గత సంవత్సరం అంగీకరించిన యూకే ఇండియా మైగ్రేషన్, మొబిలిటీ భాగస్వామ్యం యొక్క సంబంధాన్ని పెంచుతుందని UK ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

బాలిలో జరిగిన G20 సమ్మిట్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, యూకే ప్రధాని సునక్ కొద్దిసేపు పలు అంశాలపై చర్చించారు. వీరి మధ్య చర్చ జరిగిన గంటల వ్యవధిలోనే యూకే ప్రధాని కార్యాలయం కీలక నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. అయితే గత నెలలో సునక్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీతో భేటీ కావటం ఇదే తొలిసారి. ఈ విషయంపై యూకే ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఇండో- పసిఫిక్ ప్రాంతంలోని దాదాపు అన్ని దేశాల కంటే బ్రిటన్‌ భారత్‌తో ఎక్కువ సంబంధాలున్నాయని తెలిపింది. ఇప్పటికే యూకేలో భారతీయులు అధిక భాగం ఉన్నారు. ఆ దేశంలోని అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది భారతదేశానికి చెందినవారు.