Alcohol testing in car : మద్యం తాగి కారు ఎక్కితే స్టార్ట్ అవ్వదు.. మందుబాబులకు..షాకే..

మద్యం తాగి కారు ఎక్కితే స్టార్ అవ్వని టెక్నాలజీని త్వరలో అందుబాటులోకి రానుంది.

10TV Telugu News

US Cars Mandated To Identify Drunk Drives : డ్రంక్ అండ్ డ్రవ్..ఎంత మంది ప్రాణాలు తీస్తోందో. మద్యం తాగి వాహనాలు నడపవద్దని పదే పదే చెబుతున్నా అవి జరుగుతునే ఉన్నాయి. కానీ ఇకనుంచి అటువంటివి జరగవు.ఎందుకంటే ఇకనుంచి మద్యం తాగి కారు ఎక్కితే ఆ కారు స్టార్ట్ అవ్వదు. ఎవరైన డ్రింక్‌ చేసి కారు నడిపితే ఆ కారు ఆటోమెటిక్‌గా ఆగిపోతుంది. ఎంతగా యత్నించినా కారు స్టార్ట్ అవ్వదు. అటువంటి టెక్నాలజీని అందుబాటులోకి రానుంది అమెరికా. మద్యం తాగి కారు ఎక్కి స్టార్ట్ చేస్తే కారు స్టార్ట్ అవ్వదు. మద్యం తాగి ఎక్కితే కారు స్టార్ట్‌ అవ్వకుండా ఆగిపోయేలా అమెరికా కారులోనే ఆల్కహాల్ టెస్టింగ్ టెక్నాలజీ ఏర్పాటు చేసేలా రూపొందించింది. ఈ సరికొత్త సాంకేతికతో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కారణంగా జరిగే ప్రమాదాలను అరికట్టవచ్చు అని అమెరికా అంటోంది.

Read more : Gender Neutral Uniform : ఆ స్కూల్లో మగపిల్లల్లాగే ఆడపిల్లలకు కూడా షర్టు, త్రిబైఫోర్త్‌ షార్ట్స్‌
భవిష్యత్తులో మద్యం సేవించిన డ్రైవర్లను గుర్తించేలా ఈ కొత్త టెక్నాలజీ కార్లను రూపొందించే యూఎస్‌ ఫెడరల్‌ చట్టం విదేశాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని, పైగా ఏటా వేలాది ప్రాణాలను కాపాడగలమంటూ న్యాయవాదులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్‌ ఇటీవల ఈ చట్టంపై సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ చట్టం కారణంగా క్రిమినల్‌ కేసులలో కారు యజమానులకు వ్యతిరేకంగా సాక్షులను అందించగలదా అనేది అనుమానాలకు తావిచ్చేలా ఉంది. ఈ చట్టం ఆల్కహాల్ ..సంబంధిత క్రాష్‌లకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తులకు కంటగింపు అనే చెప్పాలి. అంతేకాదు ఈ చట్టం పూర్తిస్థాయిలో పనిచేయలంటే కనీసం మూడు సంవత్సారాలు పడుతుంది. దీని గురించి డ్రంక్ డ్రైవింగ్ వ్యతిరేక అడ్వకేసీ గ్రూప్ ఎంఏడీడీ జాతీయ అధ్యక్షుడు అలెక్స్ ఒట్టే మాట్లాడుతూ…” ఈ చట్టం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చెక్ పెట్టటానికి నాంది అని అన్నారు.

Read more : Viral ‘onion’: ఈ ఉల్లిని కట్‌ చేస్తే ‍కన్నీళ్లు రానేరావు..! మరి ఆ సీక్రెట్ ఏంటో తేల్చేసుకోండీ..

ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?
ఈ అ‍త్యధునిక టెక్నాలజీతో కూడిన​ కారులో డ్రైవర్ ఆల్కహాల్ డిటెక్షన్ సిస్టమ్ ఫర్ సేఫ్టీ (డీఏడీఎస్‌ఎస్‌)లో భాగంగా డ్రైవర్ శ్వాసను ఆటోమేటిక్ సంగ్రహించి పరీక్షించేలా ఒక విధమైన సెన్సార్‌లను పరిశోధకులు అభివృద్ధి చేశారు. అంతేకాదు డ్రైవర్ కారు బటన్‌ను ఆన్‌ చేసిన వెంటనే అది వ్యక్తివేళ్ల నుంచి పరారుణ-కాంతిని నేరుగా చర్మం పై ప్రసరించి అక్కడ ఉపరితలం క్రింద ఉన్న రక్తంలోని ఆల్కహాల్ స్థాయిలు ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తిస్తుంది. అలా గుర్తించాక ఇక కారు స్టార్ అవ్వకుండా ఆగిపోతుంది.

ఈ టెక్నాలజీ గురించి ఆటోమోటివ్ కోయాలిషన్ ఫర్ ట్రాఫిక్ సేఫ్టీ ప్రెసిడెంట్ రాబర్ట్ స్ట్రాస్‌బెర్గర్ మాట్లాడుతూ…”యూఎస్‌ లో పలు రాష్ట్రాల్లో .08 శాతంకి మించి బ్లడ్‌లో ఆల్కహాల్ ఉంటే కారును స్టార్ట్ చేయకుండాను..కొన్ని సందర్భాల్లో కారు ముందుకు కదలకుండా నిరోధించగల యాంటీ-చీట్ ఫంక్షన్‌లను కారులోని సిస్టమ్‌లో ఏర్పాటు చేశామని తెలిపారు. ఇటువంటి సిస్టమ్ కు కారు తయారీదారులు కూడా మద్దతు తెలుపుతున్నారని తెలిపారు.