Woman Shocked : Rs.1500 డ్రా చేద్దామని వెళితే..మహిళ అకౌంట్‌లో రూ.74వేల కోట్లు..

ఏదో ఓ 1000 రూపాయలు ఏటీఎం నుంచి డ్రా చేసుకుందామని వెళ్లి డ్రా చేశాక మన ఎకౌంట్ లో వేల కోట్ల రూపాయలు ఉన్నాయని తెలిస్తే ఎలా ఉంటుంది.ఏకంగా వేల కోట్లు..హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అవుతుంది కదూ.. ఓమహిళకు అదే అదే జరింగింది. తన ఎకౌంట్ లో రూ.74వేల కోట్లు ఉన్నాయని తెలిసి షాక్ అయ్యింది.

Woman Shocked : Rs.1500 డ్రా చేద్దామని వెళితే..మహిళ అకౌంట్‌లో రూ.74వేల కోట్లు..

Woman Shocked Find 1 Billion Dollars

Woman shocked find 1 billion dollars : ఓ సాధారణ కుటుంబంలో వారికి బ్యాంకు ఎకౌంట్ లో డబ్బులు మహా ఉంటే వేల్లో ఉంటాయి.లేదా లక్షల్లో ఉంటాయి.కానీ ఓ మహిళ బ్యాంక్ ఎకౌంట్ లో ఏకంగా రూ.74వేల కోట్లు ఉన్నాయని తెలిసి సదరు మహిళ షాక్ అయ్యింది. దాదాపు స్పృహ తప్పి పడిపోయేంత షాక్ కు గురైంది. రూ.1500లు డ్రా చేద్దామని వెళి..డ్రా చేశాక మిగిలిన బ్యాలెన్స్ ఏకంగా రూ.74 వేల కోట్లు ఉన్నాయని తెలిసి నివ్వెరపోయింది. ఆమె ఆశ్చర్యానికి అంతు లేకుండాపోయింది. దాదాపు హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అయ్యిందామెకు. యూఎస్ లోనే ఫ్లోరిడాలో ఉంటున్న మహిళకు ఎదురైందీ షాకింగ్ ఘటన.

20 డాలర్లు (రూ.దాదాపు 1500) డ్రా చేద్దామని వెళ్లిన మహిళకు తన ఎకౌంట్ లో 1 బిలియన్ డాలర్లు (74,27,19,00,000 రూపాయలు) ఉన్నట్లుగా తెలిసి షాక్ అయ్యింది. తనకు తెలియకుండా అంత డబ్బు తన ఎకౌంట్ లోకి ఎలా వచ్చాయి పైగా ఒకటీ రెండూ కాదు ఏకంగా వేలక కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని షాక్ అయ్యింది. ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంది. అది సంతోషమో..భయమో తెలియని ఉద్వేగంలో నిజంగానే హార్ట్‌ ఎటాక్‌ వచ్చినంత పని అయ్యిందామెకు.20 డాలర్లు డ్రా చేద్దామని ఏటీఎంకు వెళ్లింది. అయితే ఆమె అకౌంట్‌లో సరిపడా మొత్తం లేవని.. ఇప్పుడు 20 డాలర్లు డ్రా చేస్తే అది ఓవర్‌డ్రాఫ్ట్‌ కిందకు వస్తుందని మెసేజ్‌ వచ్చింది. పర్లేదు అనుకుని డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నించింది కానీ కుదరలేదు.

సదరు మహిళ అసలు తన బ్యాంక్‌ అకౌంట్‌లో ఎంత అమౌంట్‌ ఉందో చెక్‌ చేయగా.. దిమ్మ తిరిగిపోయింది. తన ఖాతాలో బిలయన్‌ డాలర్లు(74,26,19,00,000 రూపాయలు) ఉన్నట్లు చూపటంతో షాక్ నుంచి తేరుకోలేకపోయింది. వెంటనే బ్యాంక్‌కు వెళ్లి విషయం చెప్పింది.

బ్యాంక్ సిబ్బంది వెంటనే చెక్ చేసి..ఆమె అకౌంట్‌లోకి ఇంత మొత్తం ఎలా వచ్చిందో చెప్పారు.వాస్తవానికి సదరు మహిళ అకౌంట్‌లో నెగిటివ్‌ బిలియన్‌ డాలర్లు ఉన్నాయి. మోసాలను నివారించడానికి ఈ పద్దతిని ఉపయోగిస్తారు. అనుమానాస్పదంగా తోచిన వ్యక్తి అకౌంట్‌ను లాక్‌ చేసినప్పుడు ఇలా కనిపిస్తుంది అని వివరించారు. అందుకే మీరు 20 డాలర్లను కూడా డ్రా చేసుకోలేకపోయారని వివరించారు.