US Slams China’s Actions: చైనా పాల్పడుతోన్న చర్యలపై అమెరికా మరోసారి ఆగ్రహం

తైవాన్ చుట్టూ సముద్ర జలాల్లో సైనిక విన్యాసాలు చేస్తూ చైనా పాల్పడుతోన్న చర్యలపై అమెరికా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా చర్యలు రెచ్చగొట్టే విధంగా, బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని చెప్పింది. తమ దేశంపై దాడి చేయడం కోసమే చైనా సైన్యం సాధన చేస్తోందని తైవాన్ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా ఈ విధంగా స్పందించింది. తైవాన్ విషయంలో చైనా పాల్పడుతోన్న చర్యలు మరింత పెరిగాయని ఈ సైనిక విన్యాసాల ద్వారా స్పష్టమవుతోందని శ్వేత సౌధ ప్రతినిధి ఒకరు తెలిపారు.

US Slams China’s Actions: చైనా పాల్పడుతోన్న చర్యలపై అమెరికా మరోసారి ఆగ్రహం

China-Taiwan conflict

US Slams China’s Actions: తైవాన్ చుట్టూ సముద్ర జలాల్లో సైనిక విన్యాసాలు చేస్తూ చైనా పాల్పడుతోన్న చర్యలపై అమెరికా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా చర్యలు రెచ్చగొట్టే విధంగా, బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని చెప్పింది. తమ దేశంపై దాడి చేయడం కోసమే చైనా సైన్యం సాధన చేస్తోందని తైవాన్ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా ఈ విధంగా స్పందించింది. తైవాన్ విషయంలో చైనా పాల్పడుతోన్న చర్యలు మరింత పెరిగాయని ఈ సైనిక విన్యాసాల ద్వారా స్పష్టమవుతోందని శ్వేత సౌధ ప్రతినిధి ఒకరు తెలిపారు.

చైనా రెచ్చగొట్టే చర్యల వల్ల పరిస్థితులు ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉందని అన్నారు. తైవాన్ జల సంధి విషయంలో స్థిరత్వం, శాంతిని కొనసాగించే విషయంలో అమెరికా దీర్ఘకాలిక లక్ష్యానికి వ్యతిరేకంగా చైనా పనిచేస్తోందని చెప్పారు. చైనా, తైవాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ అంశాన్ని అమెరికా నిశితంగా పరిశీలిస్తోంది. చైనా యుద్ధ విమానాలు, నౌకలు విభజన రేఖను దాటుకుని ముందుకు దూసుకువెళ్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

చైనా దాదాపు 100 యుద్ధ విమానాలు, 10 యుద్ధ నౌకలతో విన్యాసాల్లో పాల్గొంటోంది. అయితే, ఒకవేళ చైనా దాడి చేస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తైవాన్ చెబుతోంది. సరిహద్దుల వద్ద యుద్ధ విమానాలను తైవాన్ సిద్ధంగా ఉంచింది. ఇటీవల అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ తైవాన్‌లో పర్యటించడంతో చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం యుద్ధ విన్యాసాలు చేపట్టింది.

India invites US singer Millben: 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రసిద్ధ అమెరికన్‌ గాయని మేరీ మిల్‌బెన్‌