Chandrayaan 3: చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత నేను చాలా ఫేమస్ అయ్యాను: ఆస్ట్రేలియా యువకుడు
ఆ ఆస్ట్రేలియా యువకుడికి సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్లు పెరిగిపోతున్నారు.
![Chandrayaan 3: చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత నేను చాలా ఫేమస్ అయ్యాను: ఆస్ట్రేలియా యువకుడు Chandrayaan 3: చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత నేను చాలా ఫేమస్ అయ్యాను: ఆస్ట్రేలియా యువకుడు](https://10tv.in/wp-content/uploads/2023/07/New-Project-71.jpg)
Dylan O Donnell
Chandrayaan-3 : తిరుపతి జిల్లా శ్రీహరికోట(Sriharikota)లోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (Satish Dhawan Space Centre) నుం ఇస్రో (ISRO) చంద్రయాన్-3 ప్రయోగించడంతో ప్రపంచ దేశాలు దీన్ని ఆసక్తిగా గమనించాయి. శుక్రవారం ఎల్వీఎం 3(LVM 3) వాహకనౌక నింగిలోకి దూసుకెళ్తున్న సమయంలో ఆస్ట్రేలియాలోని యూట్యూబర్ డైలాన్ ఒ డొన్నెల్ తమ దేశం నుంచి తీసిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
” భారత అంతరిక్ష సంస్థ చంద్రుడి గుట్టువిప్పేందుకు ప్రయోగించిన రాకెట్ ను యూట్యూబ్ లో చూశాను. ఆ తర్వాత అర్ధగంటకు మా ఇంటి పై కి ఎక్కితే అది ఆకాశమార్గాన కనపడింది. ఇస్రోకు కంగ్రాట్స్. చంద్రుడిపై ల్యాండ్ అవుతుందని ఆశిస్తున్నాను ” అని చెబుతూ డైలాన్ ఒ డొన్నెల్ ఫొటోను పోస్ట్ చేశాడు. ఆ ఫొటో భారత్ లో బాగా వైరల్ అయింది. దీనిపై డైలాన్ ఒ డొన్నెల్ మళ్లీ స్పందిస్తూ వరుసగా ట్వీట్లు చేశాడు.
తనకు భారత్ నుంచి ఫాలోవర్లు భారీగా పెరిగిపోయారని చెప్పాడు. నిజానికి తన తల్లి బెంగళూరులో జన్మించిందని అన్నాడు. తాను 2006లో ముంబైకి వెళ్లిన సమయంలో తీసుకున్న ఫొటోను ఈ సందర్భంగా పోస్ట్ చేశాడు. చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత తీసిన ఫొటోతో తనకు చాలా పేరు వచ్చిందంటూ మురిసిపోతున్నాడు.
To celebrate my ISRO launch photo (seen from Australia🇦🇺) going viral in 🇮🇳 & getting me to 10k tweeps, here is a photo of Anna and I in Mumbai in 2006! You can’t get me for cultural appropriation either: my mum was born in Bangalore so I’ve got a pass. Thx uncles and aunties!🚀 pic.twitter.com/nJ5c9Wr96L
— Dylan O’Donnell (@erfmufn) July 16, 2023
Just watched India’s space agency launch their moon rocket on YT then fly over my house 30 mins later! Congrats @isro ! Hopefully you stick the landing 💪🏼 pic.twitter.com/ETP8xL8lqv
— Dylan O’Donnell (@erfmufn) July 14, 2023
Chandrayaan: ఇప్పుడు చంద్రయాన్-3 వ్యోమనౌక పరిస్థితి ఎలా ఉందో తెలుసా?