Viral Video: రిషి సునక్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు.. సెటైర్ వేసి బుద్ధి చెప్పిన కమెడియన్

‘‘నేను ఏనాడైనా పాకిస్థాన్ ప్రధానిని కాగలనని మీరు ఊహించగలరా? ఇటువంటి వ్యక్తిని (నల్లజాతీయుడిని) మాత్రం ఇంగ్లండ్ ప్రజలు తమ దేశంలో ఆ స్థానంలో చూడాలనుకుంటున్నారు’’ అని ఓ కాలర్ చెప్పింది. దీంతో కమెడియన్ ట్రెవర్ నోహ్ స్పందిస్తూ సెటైర్ వేశాడు. ‘‘ఇది చాలా మంచి పాయింట్. కొన్ని దేశాల్లో కనీసం ఒక్కరు కూడా శ్వేతజాతీయుల్లా ఉండరు. అటువంటి దేశాలను పాలించడానికి శ్వేతజాతీయులు ప్రయత్నిస్తారని మీరు ఊహించగలరా?’’ అని ట్రెవర్ నోహ్ అన్నాడు. ‘‘నిజానికి 400 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ ప్రజలకు లభించిన మంచి అవకాశం ఇది. ఎందుకంటే, దేశంలో నెలకొన్న సమస్యలకు ఇప్పుడు చట్టబద్ధంగా ఓ నల్లజాతీయుడిని నిందించవచ్చు’’ అని చెప్పాడు.

Viral Video: రిషి సునక్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు.. సెటైర్ వేసి బుద్ధి చెప్పిన కమెడియన్

Viral Video: బ్రిటన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భారత సంతతి వ్యక్తి రిషి సునక్ పై ఓ యువతి జాత్యహంకార వ్యాఖ్యలు చేయడంతో ఆమెకు కమెడియన్ ట్రెవర్ ఓ నోహ్ సెటైర్ వేసి బుద్ధి చెప్పాడు. డైలీ షో హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ట్రెవర్ నోహ్ ఓ కాలర్ కు సంబంధించిన బ్రిటిష్ రేడియో షో క్లిప్ ను తన షోలో చూపించాడు. శ్వేతజాతీయేతరుడు యూకేకు ప్రధాని కావడం సరికాదని ఆ కాలర్ అందులో చెప్పింది.

నల్ల జాతీయులు ఉండే దేశాల్లో తెల్లజాతీయులు ప్రధానులు కాలేరని అభిప్రాయపడింది. ‘‘నేను ఏనాడైనా పాకిస్థాన్ ప్రధానిని కాగలనని మీరు ఊహించగలరా? ఇటువంటి వ్యక్తిని (నల్లజాతీయుడిని) మాత్రం ఇంగ్లండ్ ప్రజలు తమ దేశంలో ఆ స్థానంలో చూడాలనుకుంటున్నారు’’ అని ఆ కాలర్ చెప్పింది. దీంతో ట్రెవర్ నోహ్ స్పందిస్తూ సెటైర్ వేశాడు.

‘‘ఇది చాలా మంచి పాయింట్. కొన్ని దేశాల్లో కనీసం ఒక్కరు కూడా శ్వేతజాతీయుల్లా ఉండరు. అటువంటి దేశాలను పాలించడానికి శ్వేతజాతీయులు ప్రయత్నిస్తారని మీరు ఊహించగలరా?’’ అని ట్రెవర్ నోహ్ అన్నాడు. ‘‘నిజానికి 400 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ ప్రజలకు లభించిన మంచి అవకాశం ఇది. ఎందుకంటే, దేశంలో నెలకొన్న సమస్యలకు ఇప్పుడు చట్టబద్ధంగా ఓ నల్లజాతీయుడిని నిందించవచ్చు’’ అని చెప్పాడు. ఇంగ్లండ్ లో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న విషయం తెలిసిందే.


10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..