Congress Party: భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ ఏం చేయబోతుంది..? స్టీరింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు..

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లిఖార్జున్ ఖార్గే నేతృత్వంలో ఆదివారం పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఈ స్టీరింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Congress Party: భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ ఏం చేయబోతుంది..? స్టీరింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు..

Congress Party

Congress Party: జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఆ పార్టీ అగ్రనాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. నూతన ప్రెసిడెంట్ మల్లిఖార్జున్ ఖార్గే నేతృత్వంలో వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. ఓ పక్క భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజల్లో ఉండటంతో పాటు జోడో యాత్రకు ప్రజలనుంచి విశేష స్పందన లభిస్తుంది. ఈ క్రమంలో వరుస కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా క్యాడర్ లో జోష్ నింపి ప్రజలను మరల కాంగ్రెస్ వైపుకు మళ్లించేలా పార్టీ అగ్రనాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో ప్రజలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలపై దృష్టిసారించిన కాంగ్రెస్ పార్టీ.. వాటితోనే ప్రజల్లోకి వెళ్లి బీజేపీపై ఎదురుదాడికి దిగేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జనవరి చివరి నాటికి పూర్తవుతుంది. అయితే, ఆ తరువాత పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనేదానిపై పార్టీ అధిష్టానం దృష్టిపెట్టింది.

Rahual Gandhi: బీజేపీ నేతలకు రాహుల్ గాంధీ సలహా.. మండిపడుతున్న బీజేపీ శ్రేణులు.. ఎందుకంటే?

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లిఖార్జున్ ఖార్గే నేతృత్వంలో ఆదివారం పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఈ స్టీరింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొదటిది.. ఫిబ్రవరి నెలలో కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించనుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు ఈ ప్లీనరీ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించారు. మరోవైపు జనవరి నెల చివరినాటికి రాహుల్ భారత్ జోడో యాత్ర పూర్తవుతున్న నేపథ్యంలో.. జనవరి 26 నుంచి రెండు నెలలు పాటు ‘హత్ సే హత్ జోడో అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు నిర్ణయించారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీ యాత్రలో బాలీవుడ్ నటి స్వర భాస్కర్.. 83వ రోజుకు చేరుకున్న యాత్ర

ఈ విషయంపై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఆదివారం జరిగిన కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో రెండు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. మొదటిది ఫిబ్రవరి ద్వితీయార్థంలో ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అదేవిధంగా జనవరి 26 నుంచి ‘హత్ సే హత్ జోడో అభియాన్’ అనే భారీ ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే, ఇది రెండు నెలలపాటు సాగే ప్రచార కార్యక్రమం అని వేణుగోపాల్ తెలిపారు. 2024లో పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నిత్యం ప్రజల్లో ఉండేలా లక్ష్యంతో కార్యక్రమాల ప్రణాళిక రూపొందించినట్లు వేణుగోపాల్ అన్నారు. ఇదిలాఉంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాహుల్ గాంధీ పాల్గొనడం లేదని ఆయన తెలిపారు.