Rahual Gandhi: బీజేపీ నేతలకు రాహుల్ గాంధీ సలహా.. మండిపడుతున్న బీజేపీ శ్రేణులు.. ఎందుకంటే?

రాహుల్ గాంధీ సభలో మాట్లాడుతూ.. బీజేపీ నేతలకు సలహా ఇచ్చారు. జై సియారామ్ అంటే ఏంటి? జై సీత, జై రామ్, సీత, రాముడు ఒక్కటే, అందుకే జై సియారామ్ లేదా జై సీతారామ్ అనాలి. రాముడు సీత గౌరవంకోసం పోరాడాడు. సమాజంలో సీతలాంటి స్త్రీలను జయసియారామ్ అని పిలువాలి.

Rahual Gandhi: బీజేపీ నేతలకు రాహుల్ గాంధీ సలహా.. మండిపడుతున్న బీజేపీ శ్రేణులు.. ఎందుకంటే?

Rahual Gandhi:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అగర్ -మల్వాలో బహిరంగ సభ జరిగింది. ఈ సభలో రాహుల్ గాంధీ పాల్గొని బీజేపీ నేతల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రాహుల్ వ్యాఖ్యల పట్ల బీజేపీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రాహుల్ డ్రామా ట్రూప్ నాయకుడని విమర్శిస్తున్నారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీ యాత్రలో బాలీవుడ్ నటి స్వర భాస్కర్.. 83వ రోజుకు చేరుకున్న యాత్ర

రాహుల్ గాంధీ సభలో మాట్లాడుతూ.. బీజేపీ నేతలకు సలహా ఇచ్చారు. జై సియారామ్ అంటే ఏంటి? జై సీత, జై రామ్, సీత, రాముడు ఒక్కటే, అందుకే జై సియారామ్ లేదా జై సీతారామ్ అనాలి. రాముడు సీత గౌరవంకోసం పోరాడాడు. సమాజంలో సీతలాంటి స్త్రీలను జయసియారామ్ అని పిలువాలి. జై శ్రీరామ్ అంటే ఇందులో రాముడికొక్కడికే నమస్కారం చేప్తున్నట్లుగా ఉంటుంది. సమాజాన్ని ఏకంచేసే పనిని రాముడు చేపట్టాడు. రాముడు అందరికీ గౌరవం ఇచ్చాడు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లకు నిజంగా శ్రీరాముడిపై భక్తి ఉంటే జై శ్రీరామ్ కు బదులుగా జై సీతారామ్ అనగలారా? అని రాహుల్ ప్రశ్నించాడు.

Rahul Gandhi Bharat Jodo Yatra: ఉత్సాహంగా కొన‌సాగుతున్న‌ రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌.. (ఫొటోలు)

రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. బ్రజేష్ పాఠక్ స్పందిస్తూ.. రాహుల్ కు భారతీయ సంస్కృతి గురించి ఏమీ తెలియదు. ఓ వీధి నుంచి మరో వీధికి పరిగెత్తడం మాత్రమే రాహుల్ కు తెలుసు అని అన్నారు. మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రా మాట్లాడుతూ.. జోడో యాత్రలో విరామం దొరగ్గానే భారతదేశ చరిత్ర, సంస్కృతి పుస్తకాలు చదవాలని రాహుల్ కు సలహా ఇచ్చారు.