కరోనా “పుట్టుక”పై WHO కీలక ప్రకటన

కరోనా “పుట్టుక”పై WHO కీలక ప్రకటన

WHO Team కరోనా ఆవిర్భావంపై WHO కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్ వుహాన్​ లోని ల్యాబ్​ నుంచి లీక్ అయి ఉండకపోవచ్చని..ఇతర జంతువుల నుంచే మానవుల్లోకి ప్రవేశించి ఉండొచ్చని WHO ఫుడ్ సేఫ్టీ అండ్ ఎనిమల్ డిసీజ్ నిపుణుడు పీటర్ బెన్ ఎంబారెక్ తెలిపారు. చైనా నిపుణుల బృందంతో క‌లిసి డ‌బ్ల్యూహెచ్‌వో టీమ్ వుహాన్‌లో క‌రోనా మూలాలు క‌నిపెట్టే ప‌నిలో ఉన్న విష‌యం తెలిసిందే.

వుహాన్ నగరం నుంచే కరోనా ఉద్భవించిందన్న ఆరోపణల నేపథ్యంలో ఇక్కడ దర్యాప్తు చేశారు. ఇందులో భాగంగా 10దేశాలకు చెందిన నిపుణులతో కూడిన WHO బృందం వూహాన్ లోని హాస్పిటల్స్ ను,రీసెర్చ్ ఇనిస్టిట్యూట్స్ ని, వుహాన్ మార్కెట్‌ ని కూడా ప‌రిశీలించారు. వుహాన్​లో డబ్ల్యుహెచ్​ఓ చేసిన దర్యాప్తు వల్ల కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయన్న WHO నిపుణుల బృందం సభ్యుడు బెన్ ఎంబారెక్..కరోనా ఆవిర్భావానికి సంబంధించిన విషయంలో అస్పష్టత వీడలేదని తెలిపారు.

క‌రోనా వైర‌స్ తొలిసారి క‌నిపించిన చైనాలోని వుహాన్‌ లో 2019 డిసెంబర్ ​కు ముందే భారీ స్థాయిలో కరోనా వ్యాపించిందనేందుకు ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని బెన్ ఎంబారెక్ చెప్పారు. వుహాన్​లో కానీ, మరేచోటైనా కానీ డిసెంబర్​కు ముందే భారీ వ్యాప్తికి జరిగిందనే ఆధారాల్లేవని అన్నారు. అయితే, 2019 డిసెంబర్​లో వుహాన్ హునాన్ మార్కెట్​ వెలుపల విస్తృత వ్యాప్తికి సంబంధించిన ఆధారాలను కనుగొన్నట్లు చెప్పారు.