Covid Deaths : కరోనా.. మళ్లీ చంపేస్తోంది..!

కరోనా.. మళ్లీ చంపేస్తోంది. అవును.. ఏడాదిన్నర క్రితం వెలుగుచూసిన కరోనావైరస్ మహమ్మారి ముప్పు ఇంకా తొలగలేదనే చెప్పాలి. ప్రపంచ దేశాల్లో కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. ఈ మహమ్మారి తీవ్రత ఇటీవల కాస్త తగ్గినట్టు కనిపించినా..

Covid Deaths : కరోనా.. మళ్లీ చంపేస్తోంది..!

Covid Deaths

Covid Deaths : కరోనా.. మళ్లీ చంపేస్తోంది. అవును.. ఏడాదిన్నర క్రితం వెలుగుచూసిన కరోనావైరస్ మహమ్మారి ముప్పు ఇంకా తొలగలేదనే చెప్పాలి. ప్రపంచ దేశాల్లో కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. ఈ మహమ్మారి తీవ్రత ఇటీవల కాస్త తగ్గినట్టు కనిపించినా.. కొత్త రూపాలతో విరుచుకుపడి అనేకమంది ప్రాణాలు తీస్తోంది. తాజాగా కరోనా మరణాలు, కేసుల సంఖ్య గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

గత వారంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 21శాతం పెరిగినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అమెరికా, ఆగ్నేయాసియాలోనే(సౌత్ ఈస్ట్ ఆసియా) దాదాపు 69 వేలకు పైగా మరణాలు నమోదైనట్టు చెప్పింది. అంతేకాదు కరోనా కేసులు కూడా 8శాతం పెరిగాయంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య దాదాపు 194 మిలియన్లకు చేరినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

ఇదే ట్రెండ్‌ కొనసాగితే మాత్రం రాబోయే రెండు వారాల్లో మొత్తం ఇన్‌ఫెక్షన్ల సంఖ్య 200 మిలియన్లు దాటేస్తుందని అంచనా వేసింది. యూరప్‌ మినహా అన్ని ప్రాంతాల్లోనూ కొవిడ్‌ మరణాలు పెరుగుతున్నట్టు చెప్పింది. అమెరికా, బ్రెజిల్‌, ఇండోనేషియా, యూకే, భారత్‌లలోనే భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్టు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

మరోవైపు అమెరికా సహా పలు దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. అమెరికాలో వ్యాక్సినేషన్ జరుగుతున్నా, ఒక్కరోజే 61వేల కేసులు నమోదయ్యాయి. దీంతో బహిరంగ ప్రదేశాల్లో పక్కాగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. కొవిడ్ మొదలయ్యాక తొలిసారి టోక్యోలో 3,177 కేసులు వచ్చాయి. సిడ్నీలో నెల పాటు లాక్ డౌన్ పొడిగించారు. సౌత్ కొరియాలో అత్యధికంగా 1896 కేసులు రగా.. చైనాలోని కొన్ని ఏరియాల్లో నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేశారు. పెరుగుతున్న కేసులు, మరణాలు చూస్తుంటే.. థర్డ్ వేవ్ కి ఇది సంకేతం ఏమో అని నిపుణులు అంటున్నారు.