Wooden Chair: పాత సామాను షాపులో రూ.500కు కొన్న కుర్చీ వేలంలో రూ.16లక్షలు
యూకేలోని Brighton ప్రాంతానికి చెందిన పాత సామాను షాపులో కుర్చీని కొనుగోలు చేసింది మహిళ. ఆ సమయంలో ఆ డిజైన్ కు అంత విలువ ఉంటుందని.......

Wooden Chair
Wooden Chair: పాత సామాను షాపులో రూ 500తో కొనుగోలు చేసిన కుర్చీని వేలనికి పెట్టి రూ.16.4లక్షలు సంపాదించింది ఓ మహిళ. యూకేలోని Brighton ప్రాంతానికి చెందిన పాత సామాను షాపులో కుర్చీని కొనుగోలు చేసింది మహిళ. ఆ సమయంలో ఆ డిజైన్ కు అంత విలువ ఉంటుందని ఆమెకు కూడా తెలియదు.
ఆ తర్వాత దానిని చూసిన వేరొకరు.. అది పురాతనమైనదని 20వ శతాబ్దం కంటేముందు కుర్చీ అని తెలుసుకుంది.
దానిని ఆస్ట్రియన్ పెయింటర్ కోలోమన్ 1902లో డిజైన్ చేశారు. కోలోమన్ మోసర్ వియెన్నా సెసెషన్ మూమెంట్ లో పాల్గొన్న ఒక ఆర్టిస్ట్. సంప్రదాయ డిజైన్ లను పక్కకుపెట్టి.. ఆర్టిస్టికల్ స్టైల్స్ కు శ్రీకారం చుట్టాడు.
ఇంకా ఈ చైర్ 18వ శతాబ్దపు ల్యాడర్ బ్యాక్ చైర్ ను పోలి ఉండటం విశేషం. సీట్ భాగంలో చైర్ వెనుక భాగంలోనూ ఒకే లాంటి గ్రిడ్ ఉండటం దీని ప్రత్యేకత.
చైర్ పై కూర్చోవాలనే కుతూహలంతో ఆస్ట్రియాకు చెందిన వారే దీనిని సొంతం చేసుకున్నారట. Sworders అనే సంస్థ నిర్వహించిన వేలంలో ఫోన్ ద్వారా డీల్ ను రూ.16.4లక్షలకు కుదుర్చుకున్నారట.
Read Also : వాల్ నట్స్ తింటే యవ్వనంగా ఉంటారా!….