Amazon WFH : అమెజాన్‌ ఉద్యోగులకు 2022 లో కూడా ఇళ్లలోనే

అమెజాన్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 2022 జనవరి నుంచి కూడా ఆఫీసులకు రానక్కర్లేదని..వర్క్ ఫ్రం హోమ్ కంటిన్యూ చేయవచ్చని స్పష్టం చేసింది.

Amazon WFH : అమెజాన్‌ ఉద్యోగులకు 2022 లో కూడా ఇళ్లలోనే

Amazon Employees 2022 Work From Home

Amazon Employees  Work From Home Even in 2022 : : గత ఏడాదిన్నర కాలంగా కరోనా వల్ల వర్క్ ఫ్రం హోమ్ లోనే ఉంది ఐటీ ప్రపంచం అంతా. ఇప్పుడిప్పుడే కొన్ని కంపెనీలు ఉద్యోగుల్ని ఆఫీసుకు రావాలని చెబుతున్నాయి. అయినా ఉద్యోగులు ఆఫీసులకు రావాటానికి పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. దీంతో ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించటానికి ఆయా కంపెనీలు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నారు. అయినా వారి యత్నాలు ఫలించట్లేదు. ఈక్రమంలో అమెజాన్‌ తన ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. 2022 జనవరి నుంచి కూడా ఉద్యోగులు ఆఫీసులకు రానక్కర్లేదని తెలిపింది. వర్క్ ఫ్రం హోమ్ నే కంటిన్యూ చేయవచ్చని తెలిపింది. దీంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా టైం నుంచి వర్క్‌ఫ్రమ్‌ హోం లో మునిగిపోయింది ఐటీ లోకం వేవ్‌లవారీగా వైరస్‌ విరుచుకుపడుతున్నప్పటికీ.. వ్యాక్సినేషన్‌ రేట్‌ను పరిగణనలోకి తీసుకుని తిరిగి ఆఫీసులకు రావాలని ఉద్యోగులకు సూచిస్తున్నాయి. దానికి కారణాలు చెబుతు..క్వాలిటీ ప్రొడక్టవిటీ కోసమే ఈ పని చేయకతప్పడం లేదని చెప్తున్నాయి ఆయా కంపెనీలు.

Read more : Amazon : అమెజాన్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ..

కొన్ని మల్టీనేషనల్‌ కంపెనీలు పూర్తిస్థాయిలో ఎంప్లాయిస్‌తో, మరికొన్ని కంపెనీలు రోస్టర్‌ విధానంలోను..రొటేషన్‌ షిఫ్ట్‌లలో కొంతమంది ఉద్యోగులను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి సంబంధించి మెయిల్స్‌ ద్వారా సమాచారం కూడా అందించాయి. ఇక అమెజాన్‌ కూడా 2022 జనవరి నుంచి వర్క్‌ఫ్రమ్‌ ఆఫీసులకు ప్రాధాన్యం ఇవ్వాలనే అనుకుంది. కానీ ఈ నిర్ణయం మీదా మరోసారి సమీక్ష నిర్వహించిన అమెజాన్‌.. ఇక ఉద్యోగులు ఆఫీసులకు రానక్కర్లేదని ఇంటినుంచే పనిచేయవచ్చని వెల్లడించింది.

వారిష్టమే మా ఇష్టం..
ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించుకునే నిర్ణయించుకునే స్వేచ్ఛను ఆయా టీంలకే వదిలేసింది అమెజాన్‌. దీనికి సంబంధించి అమెజాన్‌ సీఈవో ఆండీ జస్సీ ఆయా టీంలకు మెయిల్స్‌ పంపిచినట్లుగా గీక్‌వైర్‌ వెబ్‌సైట్‌ ప్రచురించింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రత, కుటుంబ భద్రతలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నామని వెల్లడించింది. ఈ సౌకర్యాన్ని ఇచ్చిన అమెజాన్ మరో విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అదేమంటే..వర్క్‌పాలసీ వల్ల కొన్ని సమస్యలూ తలెత్తే అవకాశం ఉండడంతో ప్రొడక్టివిటీ మీద ప్రతికూల ప్రభావం పడకుండా చూడాలని ఉద్యోగులకు సూచించింది. జనవరి 3లోపు ఈ వర్క్‌పాలసీకి సంబంధించిన క్లారిటీ ప్లాన్ తో పాటు అమలు చేయాల్సిన విధివిధానాలను బ్లూప్రింట్‌ అందజేయాలని ఎంప్లాయిస్‌ను, టీఎల్‌లను కోరింది అమెజాన్‌.

Read more : Amazon : అమెజాన్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ..

ఎమర్జెన్సీ విభాగాల్లోని ఉద్యోగులు మాత్రం వారానికి మూడు రోజులు ఆఫీసుల నుంచే పని చేయాలని..వారానికి రెండు రోజులు మాత్రమే వర్క్‌ఫ్రమ్‌ హోం చేయాలని తెలిపింది. ఇక రాబోయే రోజుల్లో..ఆయా పరిస్థితులనే సమీక్షించాకే పూర్తిస్థాయి కార్యాకలాపాల మీద నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది అమెజాన్ కంపెనీ‌.