Corona Wave: భారతదేశంలో మూడో వేవ్ వచ్చేసింది.. ఢిల్లీకి ఐదవ వేవ్.. భారీగా కోవిడ్ కేసులు!

భారతదేశంలో కరోనా తన భీకర రూపాన్ని మరోసారి చూపుతోంది. గత 24 గంటల్లో 58 వేలకు పైగా కొత్త కేసులు నమోదవగా.. ఇదే సమయంలో 534 మంది మరణించారు.

Corona Wave: భారతదేశంలో మూడో వేవ్ వచ్చేసింది.. ఢిల్లీకి ఐదవ వేవ్.. భారీగా కోవిడ్ కేసులు!

New Variant

Corona Wave: భారతదేశంలో కరోనా తన భీకర రూపాన్ని మరోసారి చూపుతోంది. గత 24 గంటల్లో 58 వేలకు పైగా కొత్త కేసులు నమోదవగా.. ఇదే సమయంలో 534 మంది మరణించారు. కరోనా ఓమిక్రాన్‌తో ఢిల్లీ, మహారాష్ట్ర తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఢిల్లీలో ఓమిక్రాన్ కేసులు 464కి చేరుకోగా.. ఈ విషయమై ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ మాట్లాడుతూ.. దేశంలో మూడో వేవ్ వచ్చిందని, ఢిల్లీకి ఐదో వేవ్ వచ్చిందని అన్నారు.

ఈరోజు(5 జనవరి 2022) దాదాపు 10వేల పాజిటివ్ కేసులు నమోదవ్వొచ్చని, పాజిటివిటీ రేటు 10శాతంగా ఉందని చెప్పారు. దేశవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తుందని, అయితే ఈసారి సెకండ్ వేవ్ కంటే తేలికగా ఉందని, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదన్నారు జైన్. హోమ్ ఐసోలేషన్ అవసరం అవుతుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇప్పటి వరకు కోవిడ్‌ రోగులకు 10% పడకలు ఉండేవని, ఇప్పుడు 40% రిజర్వ్‌ చేయాలని కోరినట్లు చెప్పారు జైన్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాదాపు 2 శాతం పడకలు నిండిపోయినట్లు చెప్పారు.

దేశంలో ఇప్పటివరకు 2వేల 135 మందికి ఓమిక్రాన్ వేరియంట్‌ సోకగా.. దేశంలో ఈ వేరియంట్ బారిన పడిన రాష్ట్రాల సంఖ్య 24కి చేరుకుంది. మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. కేరళ మూడో స్థానంలో ఉండగా.. ఇప్పటివరకు మహారాష్ట్రలో 653 మందికి, ఢిల్లీలో 464 మందికి, కేరళలో 185 మందికి ఓమిక్రాన్ సోకింది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఇప్పుడు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య రెండు లక్షల 14వేల 4కి పెరిగింది. అదే సమయంలో, ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4 లక్షల 82 వేల 551కి పెరిగింది. డేటా ప్రకారం, నిన్న 15 వేల 389 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 3 కోట్ల 43 లక్షల 21 వేల 803 మంది ఇన్‌ఫెక్షన్ ఫ్రీ అయ్యారు.