Posters Against PM: ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు ప్రచారం చేశారని 12మంది అరెస్ట్

ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లతో ప్రచారం చేస్తున్న 12మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనావైరస్ మహమ్మారి ...

Posters Against PM: ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు ప్రచారం చేశారని 12మంది అరెస్ట్

Posters Against Pm

Posters Against PM: ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లతో ప్రచారం చేస్తున్న 12మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనావైరస్ మహమ్మారి నియంత్రణను హ్యాండిల్ చేస్తున్న వైఖరిపై మోడీపై దుష్ప్రచారం చేయడాన్ని గుర్తించారు.

వారిపై 13 ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసినట్లుగా వెల్లడించారు. నాలుగు డివిజన్లలో వ్యక్తులను గుర్తించి అరెస్టు చేశారు. ‘మోడీ జీ, ఆప్నే హమారే బచ్చోన్ కీ వ్యాక్సిన్ విదేశ్ క్యో భేజ్ దియా?’ (మోడీ గారూ.. మా పిల్లల వ్యాక్సిన్ ను మీరు విదేశాలకు ఎందుకు పంపించేశారు). అంటూ పోస్టర్లు దర్శనమిచ్చాయి.

తూర్పు ఢిల్లీలోని కళ్యాన్ పురి ఏరియాలో గురువారం ఆరుగురిని అరెస్టు చేశారు. ప్రధాని మోడీని విమర్శిస్తూ ఉండగా వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 800 పోస్టర్లను, బ్యానర్లను రికవర్ చేసినట్లుగా తెలిపారు.

కరోనావైరస్ మహమ్మారి ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాల్లో ఢిల్లీ ఒకటి. మెడికల్ ఆక్సిజన్ కొరతతో చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేల మంది మరణం తర్వాత రీసెంట్ గా ఇన్ఫెక్షన్ రేటు తగ్గడం, కాస్త పాజిటివ్ అంశంగా కనిపిస్తుంది.

గడిచిన మూడు వారాల్లో 3లక్షల ఇన్ఫెక్షన్లు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. చాలా మంది హాస్పిటల్ బెడ్స్ దొరకకుండానే చనిపోతున్నారు. సంక్షోభాన్ని సరిగ్గా ఎదుర్కోలేకపోతున్నారంటూ మోడీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కొవిడ్ మృతుల సంఖ్య దాచిపెడుతున్నారంటూ ప్రచారం కూడా జరుగుతుంది.