TS Government: తెలంగాణలో మరో 13 కొత్త మండలాలు.. ఏఏ జిల్లాల్లో అంటే..

తెలంగాణ రాష్ట్రంలో మరో 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు కొత్త మండలాలకు సంబంధించిన ఉత్తర్వులను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించారు. వీటిపై 15రోజుల్లోగా అభ్యంతరాలు, వినతులను సంబంధిత జిల్లాల కలెక్టర్లకు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వాటన్నింటిని పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది.

TS Government: తెలంగాణలో మరో 13 కొత్త మండలాలు.. ఏఏ జిల్లాల్లో అంటే..

TS Government: తెలంగాణ రాష్ట్రంలో మరో 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు కొత్త మండలాలకు సంబంధించిన ఉత్తర్వులను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌, స్థానిక ప్ర‌జల అవ‌స‌రాల‌ను ప‌రిశీలించి, పరిపాల‌నా సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా మ‌రికొన్ని మండ‌లాల‌ను ఏర్పాటు చేయాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్త మండలాలు ఇలా..

• నారాయణ పేట జిల్లా/ రెవిన్యూ డివిజన్ పరిధిలో గుండుమల్ (Gundumal), కొత్తపల్లె (Kothapalle) మండలాలు.
• వికారాబాద్ జిల్లాలోని, తాండూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో దుడ్యాల్ (Dudyal) మండలం.
• మహబూబ్ నగర్ జిల్లా/ రెవిన్యూ డివిజన్ పరిధిలో కౌకుంట్ల (Koukuntla) మండలం.
• నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో ఆలూర్ (Aloor), డొంకేశ్వర్ (Donkeshwar) మండలాలు.
• నిజామాబాద్ జిల్లా, బోధన్ రెవిన్యూ డివిజన్ పరిధిలో, సాలూర (Saloora) మండలం.
• కామారెడ్డి జిల్లాలోని, బాన్స్ వాడ రెవిన్యూ డివిజన్ పరిధిలో డోంగ్లి (Dongli) మండలం
• జగిత్యాల జిల్లా/ జగిత్యాల రెవిన్యూ డివిజన్ పరిధిలో ఎండపల్లి (Endapally) మండలం.
• జగిత్యాల జిల్లా కోరుట్ల డివిజన్ పరిధిలో భీమారం (Bheemaram) మండలం.
• మహబూబాబాద్ జిల్లా/ రెవిన్యూ డివిజన్ పరిధిలో సీరోల్ (Seerole) మండలం.
• నల్లగొండ జిల్లా/ రెవిన్యూ డివిజన్ పరిధిలో గట్టుప్పల్ (Gattuppal) మండలం
• సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ రెవిన్యూ డివిజన్ పరిధిలో నిజాంపేట్ (Nizampet) మండలం.

TS Politics : పోలవరం ప్రాజెక్టుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు..జగన్ కు స్వీట్లు తినిపించినప్పుడు ఆ విషయం గుర్తు లేదా?

ఇదిలాఉంటే మండలాల ఏర్పాటులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్థానిక ప్రజలు 15 రోజుల్లోగా అభ్యంతరాలు, వినతులను సంబంధిత జిల్లాల కలెక్టర్లకు అందించాలని రెవెన్యూశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. వాటన్నింటిని పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది.