Corona Cases : దేశంలో కొత్తగా 157 కరోనా కేసులు, వైరస్ సోకి ఒకరు మృతి

చైనాలో కరోనా మళ్లీ విలయతాండబం చేస్తోంది. రోజుకు లక్షల్లో కేసులు నమోదుకావడం ఆందోళన కల్గిస్తోంది. భారత్ లోనూ కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 157 కరోనా కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు.

Corona Cases : దేశంలో కొత్తగా 157 కరోనా కేసులు, వైరస్ సోకి ఒకరు మృతి

CORONA CASES

corona cases : కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చైనాలో కరోనా మళ్లీ విలయతాండబం చేస్తోంది. రోజుకు లక్షల్లో కేసులు నమోదుకావడం ఆందోళన కల్గిస్తోంది. భారత్ లోనూ కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 157 కరోనా కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు.

గత 24 గంటల్లో 49,464 మందికి కరోనా వైరస్ నిర్ధరాణ పరీక్షలు చేశారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 4,46,77,459 కేసులు నమోదు అయ్యాయి. 4,41,43,342 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో వైరస్ బారిన పడి మొత్తం 5,30,696 మంది మరణించారు.

Four Foreigners : బీహార్ లో నలుగురు విదేశీయులకు కరోనా

ప్రస్తుతం 3,421 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 0.01 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.80 శాతం, మరణాలు రేటు 1.19శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటివరకు 220.06 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

మరోవైపు చైనాలో బీఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేపుతోంది. ఈ కొత్త వేరియంట్ కారణంగా ఆ దేశంలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. భారత్ లోకి బీఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించింది. దేశంలో మూడు కొత్త వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. గుజరాత్ లో రెండు, ఒడిశాలో ఒకటి చొప్పున నమోదు అయ్యాయి.