Four Foreigners : బీహార్ లో నలుగురు విదేశీయులకు కరోనా

బీహార్ లో నలుగురు విదేశీయులకు కొవిడ్ పాజిటివ్ గా తేలడం కలవరానికి గురి చేస్తోంది. బీహార్ లోని గయ విమానాశ్రయంలో నిర్వహించిన ఆర్టీసీఆర్ పరీక్షల్లో విదేశాల నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులకు పాజిటివ్ గా తేలింది.

Four Foreigners : బీహార్ లో నలుగురు విదేశీయులకు కరోనా

CORONA (2)

Updated On : December 26, 2022 / 3:24 PM IST

Four foreigners  : కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ కారణంగా మరోసారి కొవిడ్ ముప్పు పొందిఉండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. భారత్ లో కూైడా కరోనా కేసులు పెరుగుతున్నాయి.  తాజాగా బీహార్ లో నలుగురు విదేశీయులకు కొవిడ్ పాజిటివ్ గా తేలడం కలవరానికి గురి చేస్తోంది. బీహార్ లోని గయ విమానాశ్రయంలో నిర్వహించిన ఆర్టీసీఆర్ పరీక్షల్లో విదేశాల నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులకు పాజిటివ్ గా తేలింది.

Corona Cases : దేశంలో కొత్తగా 196 కరోనా కేసులు, రెండు మరణాలు

వారిలో ఒకరు మయన్మార్ నుంచి రాగా, మరొకరు థాయ్ లాండ్, ఇద్దరు ఇంగ్లాడ్ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. పాజిటివ్ గా తేతేలిన వారిని గయలోని హోటల్ లో ఐసోలేషన్ లో ఉంచినట్లు తెలిపారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాల్లో బయటపడిన ఒమిక్రాన్ బీఎఫ్-7 రకం కరోనా వైరస్.. భారత్ లోనూ వెలుగుచూసింది.  గత వారం గుజరాత్ లో ఇద్దరిలో, ఒడిశాలో ఒకరిలో ఒమిక్రాన్ బీఎఫ్-7 రకం కరోనా వేరియంట్ బయటపడింది.