Soldiers Killed: లోయలో పడ్డ సైనిక వాహనం.. 16 మంది భారత సైనికులు మృతి

భారత్-చైనా సరిహద్దులో ట్రక్కు లోయలో పడిన ఘటనలో 16 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సిక్కింలోని జెమా ప్రాంతం వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది.

Soldiers Killed: లోయలో పడ్డ సైనిక వాహనం.. 16 మంది భారత సైనికులు మృతి

Updated On : December 23, 2022 / 4:09 PM IST

Soldiers Killed: భారత్-చైనా సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మీ ట్రక్కు లోయలో పడిన ఘటనలో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 13 మంది సైనికులు కాగా, మిగతా ముగ్గురు సైనికాధికారులు ఉన్నారు. మరో నలుగురు సైనికులు గాయపడ్డారు.

UP 1st Govt Bus Women Driver : యూపీలో తొలి మహిళా బస్సు డ్రైవర్‌ ‘ప్రియాంక శర్మ’

చైనా సరిహద్దును ఆనుకుని ఉన్న సిక్కిం ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. 3 వాహనాలతో కూడిన ఆర్మీ కాన్వాయ్ ఛాటెన్ ప్రాంతం నుంచి తంగు వెళ్తుండగా, సిక్కింలోని జెమా ప్రాంతం వద్ద ట్రక్కు లోయలో పడిపోయింది. వాహనం వెళ్తున్న సమయంలో ఒక చిన్న మలుపు వచ్చింది. ఈ మలుపు వద్ద దారి చిన్నగా ఉండటంతో వాహనం అదుపుతప్పింది. దీంతో ట్రక్కు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 16 మంది సైనికులు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న భద్రతా దళాలు సహాయక చర్యలు చేపట్టాయి.

Jayaprada : ఎలక్షన్ టైంలో నన్ను చంపేస్తామని బెదిరించారు..

గాయపడ్డ వారిని హెలికాప్టర్ల ద్వారా రక్షించి, ఆస్పత్రికి తరలించారు. మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఈ ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమర జవాన్ల సేవలను దేశం ఎప్పుడూ మర్చిపోదని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.