Jayaprada : ఎలక్షన్ టైంలో నన్ను చంపేస్తామని బెదిరించారు..
జయప్రద మాట్లాడుతూ.. నేను రాజకీయాల్లోకి వెళ్ళాక చాలా సార్లు అనుకున్నాను సినిమా లైఫ్ బాగుంది, నాకు ఎందుకొచ్చిన ఈ గొడవలు అని. ఎలక్షన్స్ టైంలో నన్ను బయటకి వెళ్తే చంపేస్తామని, యాసిడ్ పోస్తామని బెదిరింపులు................

Jayaprada emotional while sharing about attack on her in politics
Jayaprada : బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. అన్‌స్టాపబుల్ రెండో సీజన్ లో ఇప్పటికే అయిదు ఎపిసోడ్ లు పూర్తికాగా తాజాగా ఆరో ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఆరో ఎపిసోడ్ కి ముగ్గురు భామలని తీసుకొచ్చారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ జయప్రద, జయసుధలతో పాటు ఇప్పటి హీరోయిన్ రాశిఖన్నాని తీసుకొచ్చారు. ఈ ముగ్గురితో కలిసి బాలయ్య ఎపిసోడ్ లో సందడి చేశారు.
ఈ ఎపిసోడ్ లో జయసుధ, జయప్రదలతో అప్పటి సినిమాలు, నటుల గురించి మాట్లాడారు. అలాగే వాళ్ళ పర్సనల్ విషయాలని కూడా షేర్ చేసుకున్నారు. వాళ్ళ లైఫ్ లో జరిగిన చేదు సంఘటనలని గుర్తు చేసుకొని బాధపడ్డారు.
Jayasudha : నా భర్త చనిపోయినప్పుడు నాకు ఎవ్వరూ చెప్పలేదు..
జయప్రద మాట్లాడుతూ.. నేను రాజకీయాల్లోకి వెళ్ళాక చాలా సార్లు అనుకున్నాను సినిమా లైఫ్ బాగుంది, నాకు ఎందుకొచ్చిన ఈ గొడవలు అని. ఎలక్షన్స్ టైంలో నన్ను బయటకి వెళ్తే చంపేస్తామని, యాసిడ్ పోస్తామని బెదిరింపులు వచ్చాయి. 2019 ఎలక్షన్స్ టైంలో జయప్రద మీద అటాక్ జరిగింది. దాని గురించి కూడా మాట్లాడుతూ ఆ రోజు నన్ను మొత్తం చుట్టుముట్టేశారు. ఆ సంఘటన ఇప్పటికి తలుచుకుంటే భయమేస్తుంది. బయటకి వచ్చి ఇంటికి వెళ్తానా, వెళ్ళనా అనుకునేదాన్ని అంటూ ఎమోషనల్ అయింది.