6G Network : 2030 నాటికి 6G నెట్‌వర్క్‌ వస్తే.. స్మార్ట్‌ఫోన్లకు కాలం చెల్లినట్టేనా..?

6G Network : మాయ.. మాయ.. అంతా డిజిటల్ మాయ.. టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే సాంకేతికపరంగా చాలా మార్పులు వచ్చాయి. రానున్న రోజుల్లో సాంకేతికత ఇంకా అడ్వాన్స్ స్టేజ్‌లోకి వెళ్లనుంది.

6G Network : 2030 నాటికి 6G నెట్‌వర్క్‌ వస్తే.. స్మార్ట్‌ఫోన్లకు కాలం చెల్లినట్టేనా..?

6g Will Make Ssmartphones Obsolete, Says Nokia Ceo

6G Network : మాయ.. మాయ.. అంతా డిజిటల్ మాయ.. టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే సాంకేతికపరంగా చాలా మార్పులు వచ్చాయి. రానున్న రోజుల్లో సాంకేతికత ఇంకా అడ్వాన్స్ స్టేజ్‌లోకి వెళ్లనుంది. అప్పట్లో 2Gకి పోటీగా 3G నెట్ వర్క్ అందుబాటులోకి వచ్చింది. 3Gకి పోటీగా 4G నెట్ వర్క్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చే స్మార్ట్ ఫోన్లలో 4G నెట్ వర్క్ సపోర్టు అందిస్తున్నాయి. ప్రస్తుతం 4G ట్రెండ్ నడుస్తోంది. పలు దేశాల్లో 5G నెట్ వర్క్ అందుబాటులోకి వచ్చింది.. కానీ, ఇండియాలో మాత్రం 5G నెట్ వర్క్ ఇంకా అందుబాటులోకి రాలేదనే చెప్పాలి. 5G నెట్ వర్క్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకముందే దానికంటే అడ్వాన్స్ నెట్ వర్క్ టెక్నాలజీ 6G అందుబాటులోకి రానుంది. 6G నెట్ వర్క్ గానీ అందుబాటులోకి వస్తే.. ఇప్పటివరకూ ఉన్న స్మార్ట్ ఫోన్లకు కాలం చెల్లినట్టే.. స్మార్ట్ ఫోన్ల కామన్ ఇంటర్ ఫేస్ మారిపోనుంది.

స్మార్ట్ ఫోన్ల వాడకం కూడా తగ్గిపోనుంది. 2030 నాటికి ఈ 6G నెట్ వర్క్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ 6G మొబైల్ నెట్ వర్క్‌లు ఒకసారి పనిచేయడం ప్రారంభిస్తే.. స్మార్ట్ ఫోన్లన్నీ పాతబడిపోతాయని నోకియా సీఈఓ పెక్కా లండ్‌బర్గ్ చెప్పారు. 2030 నాటికి 6G అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నాని తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) 2022లో పాల్గొన్న నోకియా టాప్ చీఫ్, 6G మొబైల్ నెట్‌వర్క్‌లు, ఒకసారి పనిచేస్తే, స్మార్ట్‌ఫోన్‌లు పాతబడిపోతాయని అన్నారు.

6g Will Make Ssmartphones Obsolete, Says Nokia Ceo

6g Will Make Ssmartphones Obsolete, Says Nokia Ceo

ఎందుకంటే.. ఈ రోజు మనకు తెలిసిన స్మార్ట్‌ఫోన్ అత్యంత సాధారణ ఇంటర్‌ఫేస్ కాదన్నారు. రాబోయే టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్ల కన్నా అడ్వాన్స్ టెక్నికల్ ప్రామాణాలతో రావడానికి అవకాశం లేకపోలేదన్నారు. అయినప్పటికీ, సాధారణ ఇంటర్‌ఫేస్‌గా ఉన్న స్మార్ట్‌ఫోన్‌ స్థానాన్ని ఏ డివైజ్ భర్తీ చేస్తుందో మాత్రం నోకియా సీఈఓ పేర్కొనలేదు. న్యూరాలింక్ వంటి అనేక కంపెనీలు శరీరంలో చొప్పించే చిప్‌లను డెవలప్ చేయడంపై పని చేస్తున్నాయి. ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని కంపెనీ, గత ఏడాదిలోనే ఒక మకాక్ మింగ్ పాంగ్ ఆడుతున్నట్లు వీడియోను రిలీజ్ చేసింది. 6G నెట్‌వర్క్‌లు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. ప్రస్తుతానికి 6G నెట్‌వర్క్‌లకు సరైన డేటా అందుబాటులో లేదు.

మెటావర్స్ వంటి కాన్సెప్ట్‌లు 6G నెట్ వర్క్ ద్వారా మంచి జనాదరణ పొందవచ్చని భావిస్తున్నారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) వర్చువల్ రియాలిటీ (VR)కి సపోర్టు చేసే డివైజ్‌లు రాబోయే ఏళ్లలో వాటిదే హవా ఉంటాయని కంపెనీలు భావిస్తున్నాయి. ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా 6G నెట్‌వర్క్ విస్తరణ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టేశాయి. భారత్ వంటి దేశాలు ఇంకా 5G నెట్ వర్క్ ప్రవేశపెట్టలేదు. 5G స్పెక్ట్రమ్ వేలం ఈ ఏడాది చివర్లో నిర్వహించే అవకాశం ఉంది. ఆ తర్వాత త్వరలోనే కమర్షియల్‌గా 5G నెట్ వర్క్ వస్తుందని భావిస్తున్నారు.

వాణిజ్య ఉపయోగానికి సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత 6G నెట్‌వర్క్ వేగంగానూ సాఫీగా సాగేలా చూసేందుకు ఇప్పటికే ఒక టాస్క్‌ఫోర్స్‌ను రూపొందించినట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు. భారత్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా దేశంలో స్వదేశీ 6G సాంకేతికతపై పనిచేస్తోందని, ఇది 2023 లేదా 2024 నాటికి సిద్ధంగా ఉంటుందని ప్రకటించారు.

Read Also : 5G Network: ఫైనల్ స్టేజికి చేరుకున్న 5జీ నెట్‌వర్క్ పనులు