Arvind Kejriwal: ఆప్ నిజాయతీతో కూడిన పార్టీ అని పీఎం మోదీనే చెప్పారు – కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బీజేపీయేతర పార్టీలతో పొత్తు గురించి ఆదివారం మాట్లాడారు. ఎన్నికల తర్వాత సరిపడనన్ని ఓట్లు దక్కించుకోలేకపోతే పొత్త తప్పదా అని అడిగిన ప్రశ్నకు ఇండియాలోని..

Arvind Kejriwal: ఆప్ నిజాయతీతో కూడిన పార్టీ అని పీఎం మోదీనే చెప్పారు – కేజ్రీవాల్

Arvind Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బీజేపీయేతర పార్టీలతో పొత్తు గురించి ఆదివారం మాట్లాడారు. ఎన్నికల తర్వాత సరిపడనన్ని ఓట్లు దక్కించుకోలేకపోతే పొత్త తప్పదా అని అడిగిన ప్రశ్నకు ఇండియాలోని మోస్ట్ హానెస్ట్ పార్టీ ఆప్ అని పీఎం మోదీనే సర్టిఫై చేశారని వెల్లడించారు.

‘స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇండియాస్ మోస్ట్ హానెస్ట్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అని పీఎం మోదీ ప్రశంసించారు. నాపై, మనీశ్ సిసోడియాలపై సీబీఐ, పోలీస్ రైడ్స్ చాలా జరిగాయి. 21మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేసి, 400ఫైల్స్ ను పరీక్షించారు. ఏం దొరకలేదు. అవినీతి లేని పాలన మా డీఎన్ఏలోనే ఉంది’ అని వివరించారు కేజ్రీవాల్.

ఆప్ నేషనల్ కన్వీనర్ ప్రతి ఇంటికి తిరిగి ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లను ఓడించేలా ప్రజా సమస్యలపై పోరాడతామంటూ హామీ ఇస్తున్నారు. ‘ఉచిత కరెంట్ మొదలైనవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ కూడా చెప్పింది. కాంగ్రెస్ కు వేసిన ప్రతి ఓటు బీజేపీకే వెళ్తుంది. ఎందుకంటే 17మంది ఎమ్మెల్యేలలో 15మంది బీజేపీకి అమ్ముడుపోయారు’ అని విమర్శించారు.

ఇది కూడా చదవండి : ఫిబ్రవరి 14 న ఒకే దశలో గోవా అసెంబ్లీ ఎన్నికలు-మార్చి10న ఫలితాలు