‘కార్తికేయ 2’ షూటింగ్‌‌లో ప్రమాదం.. నిఖిల్‌కు గాయాలు..

యంగ్ హీరో నిఖిల్‌, చందు మెుండేటి కాంబినేష‌న్‌లో వచ్చిన ‘కార్తికేయ’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ తర్వాత ఇటీవలే షూటింగ్ పున:ప్రారంభమైంది.

‘కార్తికేయ 2’ షూటింగ్‌‌లో ప్రమాదం.. నిఖిల్‌కు గాయాలు..

Nikhil Siddhartha: యంగ్ హీరో నిఖిల్‌, చందు మెుండేటి కాంబినేష‌న్‌లో వచ్చిన ‘కార్తికేయ’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ తర్వాత ఇటీవలే షూటింగ్ పున:ప్రారంభమైంది.

Karthikeya 2

ప్రస్తుతం గుజరాత్‌లో ‘కార్తికేయ 2’ షూటింగ్‌ జరుగుతోంది. చిత్రీకరణ జరుగుతుండగా నిఖిల్ ప్రమాదానికి గురయ్యాడు. ఒక మెయిన్ యాక్షన్ సీన్ చిత్రికరిస్తున్న సమయంలో యాక్సిడెంట్ జరిగింది. నిఖిల్‌కి స్వల్ప గాయాలయ్యాయి.. కాలుకి గాయం అవ్వడం వలన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడం ఆపివేశారు.. మరికొన్ని రోజులు ఈ యాక్షన్ సీన్స్‌కి దూరంగా ఉండబోతోంది చిత్ర బృందం..

Karthikeya 2

ప్రస్తుతం నిఖిల్ ఆరోగ్యం బాగానే ఉంది.. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రి& అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టి.జి విశ్వ ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.