Krithi Shetty : పాప ఫుల్ బిజీ.. డేట్స్ ఖాళీ లేవంటున్న కృతి శెట్టి..

చేసింది ఒక్క సినిమానే.. కానీ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది.. స్టార్ డైరెక్టర్ల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకూ అందరి చూపు తనవైపు తిప్పుకుని.. వరుస ఆఫర్లు కొట్టేస్తుంది కన్నడ చిన్నది కృతి శెట్టి..

Krithi Shetty : పాప ఫుల్ బిజీ.. డేట్స్ ఖాళీ లేవంటున్న కృతి శెట్టి..

Actress Krithi Shetty Upcoming Projects

Krithi Shetty: చేసింది ఒక్క సినిమానే.. కానీ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది.. స్టార్ డైరెక్టర్ల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకూ అందరి చూపు తనవైపు తిప్పుకుని.. వరుస ఆఫర్లు కొట్టేస్తుంది కన్నడ చిన్నది కృతి శెట్టి.. ప్రస్తుతం చేతిలో మూడు సినిమాలతో బిజీగా కృతి కోసం తెగ ట్రై చేస్తున్నారు మేకర్స్..

Uppena

‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి… మొదటి సినిమాతోనే కుర్రాళ్లను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.. చూడచక్కని రూపంతోపాటు అభినయంతోనూ ఆకట్టుకుంది కృతి.. ఇక ‘ఉప్పెన’ సినిమా సంచలన విజయం సాధించడంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. దాంతో ఇప్పుడు అందరి చూపు కృతి వైపే పడ్డాయి. యంగ్ హీరోలంతా ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.

‘ఉప్పెన’ తరువాత తెలుగులో ఇప్పటికే పలు సినిమాలకు ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేచురల్ స్టార్ నానితో ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా చేస్తోంది కృతి శెట్టి. ఈ మూవీ షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చింది. అలాగే సుధీర్ బాబు నటిస్తున్న కొత్త సినిమాలో కూడా కృతి కన్‌ఫార్మ్ అయ్యింది. ఈ రెండు సినిమాలతో పాటు ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తమిళ డైరెక్టర్ లింగు స్వామి తెరకెక్కిస్తోన్న సినిమాలోనూ కృతినే హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు.

Shyam Singha Roy

ఇవే కాదు, మరి కొన్ని సినిమాలు కూడా ఈ అమ్మడి ఖాతాలో ఉన్నాయని తెలుస్తుంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు సినిమా కోసం కూడా కృతి పేరుని పరిశీలిస్తున్నట్టు టాక్. అంతే కాదు మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ కన్నడ కస్తూరి డేట్స్ ఖాళీ లేక.. రానా తమ్ముడు అభిరామ్, బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేష్ కొత్త సినిమాలను రిజెక్ట్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల వారి సమాచారం. ఏది ఏమైనా ఒక్క సినిమాతో టాలీవుడ్ చూపు తన వైపు తిప్పుకున్న కృతి.. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది..