Telugu Film Shootings: ఏ సినిమా ఎక్కడ షూటింగ్ జరుగుతుందంటే?
సమాజంలో కరోనా భయం తగ్గి మళ్ళీ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపడంతో ఇప్పటి వరకు వేచిచూసిన సినిమాలు ఇప్పుడు వరసగా రిలీజ్ డేట్స్ ప్రకటిస్తుండగా.. మరోవైపు షూటింగ్ మధ్యలో..

Telugu Film Shootings (1)
Telugu Film Shootings: సమాజంలో కరోనా భయం తగ్గి మళ్ళీ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపడంతో ఇప్పటి వరకు వేచిచూసిన సినిమాలు ఇప్పుడు వరసగా రిలీజ్ డేట్స్ ప్రకటిస్తుండగా.. మరోవైపు షూటింగ్ మధ్యలో ఉన్న సినిమాలు.. కొత్త సినిమాలు కూడా ముమ్మర షూటింగ్ లో ఉన్నాయి. ఏ సినిమా ఎక్కడ షూట్ లో ఉందో చూస్తే.. ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో నటిస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ ముంబయ్ లో జరుగుతుంది. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు.
Hamida Khatoon: హమీదా.. నీ అందానికి కుర్రకారు ఫిదా!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఇక, పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించే సర్కారు వారి పాట సినిమా షూటింగ్ స్పోయిన్ లో జరుగుతుండగా.. అల్లు అర్జున్, సుకుమార్ సినిమా పుష్ప లాస్ట్ షెడ్యుల్ భూత్ బంగ్లాలో జరుగుతుంది. విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లైగర్ సినిమా గోవా లో జరుగుతుంది.
Sreeleela: కవ్విస్తున్న కన్నడ లేత సోయగం శ్రీలీల!
మన్మధుడు నాగార్జున బంగార్రాజు సినిమా షూటింగ్ నానక్ రామ్ గుడా రామానాయుడు స్టూడియోలో జరుగుతుండగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న మల్టీస్టారర్ f3 సినిమా షూటింగ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో జరుగుతుంది. రవితేజ నక్కిన త్రినాథ్ రావు డైరెక్షన్ లో నటిస్తున్న చిత్రం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుండగా.. నాని నటిస్తున్న అంటే సుందరానికి మూవీ హైదరాబాద్ లో జరుగుతుంది.
Vedhika: అందానికే వేదిక ఈ చేప కళ్ళ భామ!
గోపిచంద్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న పక్క కమర్షియల్ సినిమా షూటింగ్ కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుండగా.. శర్వానంద్ నటిస్తున్న ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.