Adivi Sesh: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఎనిమిది సినిమాలకు నో చెప్పాడట!

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ‘మేజర్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే సక్సెస్ అందుకున్న ఈ హీరో, తాజాగా ‘హిట్-2’ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Adivi Sesh: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఎనిమిది సినిమాలకు నో చెప్పాడట!

Adivi Sesh Rejected 8 Bollywood Movies

Adivi Sesh: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ‘మేజర్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే సక్సెస్ అందుకున్న ఈ హీరో, తాజాగా ‘హిట్-2’ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమాలో అడివి శేష్ టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ రావడంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Adivi Sesh : విశ్వక్‌సేన్‌కి తెలుసు అన్న తర్వాతే ఈ కథ వినడానికి ఒప్పుకున్నాను..

ఈ సినిమా రిలీజ్ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో అడివి శేష్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఆయన ‘మేజర్’ సినిమా సక్సెస్ తరువాత బాలీవుడ్ నుంచి వరుసగా ఆఫర్స్ వచ్చాయని.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 8 సినిమాలకు శేష్ నో చెప్పాడట. అయితే తాను అప్పటికే కమిట్ అయిన సినిమాలు ఉండటంతో బాలీవుడ్ సినిమాలకు నో చెప్పాడట ఈ యంగ్ హీరో.

Adivi Sesh : హిట్ 2 సినిమాలో కిస్ సీన్స్ చేస్తే మా అమ్మ తిట్టింది..

ఇక ‘హిట్ 2’ తరువాత తాను గూఢచారి-2 సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లుగా అడివి శేష్ తెలిపాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులు పూర్తి చేసేందుకు తనకు కనీసం 6 నెలల సమయం పడుతుందని అడివి శేష్ తెలిపాడు. ఏదేమైనా తనదైన మార్క్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ వరుసగా సూపర్ హిట్స్ అందుకుని దూసుకెళ్తున్న అడివి శేష్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాడు.