BJPLeaks : బండి సంజయ్ అరెస్ట్.. ట్రెండింగ్‌లో #BJPLeaks

BJPLeaks : పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ అరెస్ట్ కావడంతో.. బీజేపీ లీక్స్ హాష్ ట్యాగ్ (#BJPLeaks) ట్రెండింగ్ లో నిలిచింది.

BJPLeaks : బండి సంజయ్ అరెస్ట్.. ట్రెండింగ్‌లో #BJPLeaks

BJPLeaks (Photo : Twitter)

Updated On : April 5, 2023 / 8:39 PM IST

BJPLeaks : తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. టెన్త్ క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారం దుమారం రేపింది. ఈ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. బండి సంజయ్ పై ఐటీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మాల్‌ ప్రాక్టీస్‌ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసు రిమాండ్ ద్వారా కీలక విషయాలు తెలిశాయి. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ ను ఏ1 గా పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం. ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేశ్ పేర్లను నమోదుచేశారు. బండి సంజయ్ పై రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.

బండి సంజయ్ అరెస్ట్ తో బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. బండి సంజయ్ అరెస్ట్ అక్రమం, ఇది బీఆర్ఎస్ కుట్ర అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అటు బీఆర్ఎస్ నేతలు సైతం బీజేపీపై ఎదురుదాడికి దిగారు. బీజేపీ నేతలు ఎన్నికల కోసం కుట్రలు పన్నారని ఆరోపించారు. క్వశ్చన్ పేపర్ల లీక్ వెనుక బీజేపీ నేతల హస్తముందన్నారు. బీజేపీ నాయకులు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఫైర్ అయ్యారు.

Also Read..CP Ranganath: అందుకే పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్.. బండి సంజయ్ ఫోన్ ఎక్కడ ఉందో చెప్పడం లేదు: సీపీ రంగనాథ్

ఇక.. తెలంగాణలో ప్రశ్నాపత్రాల లీకేజీల వ్యవహారం సంచలనంగా మారింది. పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ అరెస్ట్ కావడంతో.. బీజేపీ లీక్స్ హాష్ ట్యాగ్ (#BJPLeaks) ట్రెండింగ్ లో నిలిచింది. బీఆర్ఎస్ నాయకులు, మద్దతుదారులు ఈ హాష్ ట్యాగ్ తో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. దీంతో బీజేపీ లీక్స్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. సోషల్ మీడియా వేదికగా బీజేపీని, బండి సంజయ్ ని టార్గెట్ చేశారు బీఆర్ఎస్ నాయకులు. Where is your phone bandi? అని ప్రశ్నిస్తూ బండి సంజయ్ ను టార్గెట్ చేశారు.

టెన్త్ క్వశ్చన్ పేపర్ల లీకేజీ వెనుక బీజేపీ కుట్ర ఉందని, ఆ కుట్ర వెనుక బండి సంజయ్ మాస్టర్ ప్లాన్ ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తమ రాజకీయ లబ్ది కోసం, బీఆర్ఎస్ ను బద్నామ్ చేసేందుకు విద్యార్థుల జీవితాలతో బండి సంజయ్ చెలగాటం ఆడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలకు చదువు విలువ తెలియదన్నారు. రాష్ట్రం నుంచి ఢిల్లీ దాకా ఆ పార్టీలో ఫేక్ సర్టిఫికెట్ల నేతలు ఎక్కువ అని విమర్శించారు.

తాండూరులో తెలుగు క్వశ్చన్ పేర్, వరంగల్ లో హిందీ క్వశ్చన్ పేపర్ లీక్ కు పాల్పడింది బీజేపీ కార్యకర్తలే అని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ రెండు ఘటనల వెనుక బండి సంజయ్ కుట్ర ఉందన్నారు. తాండూరులో వాట్సాప్ లో క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన టీచర్.. బీజేపీ ఉపాధ్యాయ సంఘం నేత అని అన్నారు. ఇక వరంగల్ లో హిందీ పేపర్ లీక్ చేయడానికి ప్రయత్నించిన ప్రశాంత్.. కరుడుగట్టిన బీజేపీ కార్యకర్త, బండి సంజయ్ అనుచరుడు అని ఆరోపణలు చేశారు. బీజేపీ నేతలతో ప్రశాంత్ దిగిన ఫొటోలను, పోస్టర్లను బీఆర్ఎస్ నాయకులు మీడియాకు చూపించారు.

Also Read..Bandi Sanjay: పేపర్ లీక్ కేసులో ఏ1గా బండి సంజయ్.. వాహనంపై రాళ్లు, చెప్పులు విసిరిన టీఆర్ఎస్ కార్యకర్తలు

విద్యార్థుల జీవితాలతో, వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడే హక్కు బీజేపీకి ఎవరిచ్చారని మండిపడ్డారు. పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడేలా ప్రభుత్వాలు పని చేయాలి కానీ అధికారం కోసం వారి భవిష్యత్తును పణంగా పెట్టొద్దని హితవు పలికారు. టెన్త్ క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయనే వార్తలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. విద్యార్థులు తమ చదువులపై దృష్టి పెట్టాలని సూచించారు.