Railway Board orders: ఒడిశా రైలు ప్రమాదం ఎఫెక్ట్: రైల్వే సిగ్నల్‌కు ఇక డబుల్ లాక్

ఒడిశా రైలు ప్రమాదం తర్వాత ప్రమాదాల నివారణకు రైల్వే బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిగ్నలింగ్ వ్యవస్థకు డబుల్ లాక్ చేయాలని రైల్వేబోర్డు అధికారులను ఆదేశించింది....

Railway Board orders: ఒడిశా రైలు ప్రమాదం ఎఫెక్ట్: రైల్వే సిగ్నల్‌కు ఇక డబుల్ లాక్

double locking of signalling

Railway Board orders double locking of signalling: ఒడిశా రైలు ప్రమాదం తర్వాత ప్రమాదాల నివారణకు రైల్వే బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది.(Odisha train crash) సిగ్నలింగ్ వ్యవస్థకు డబుల్ లాక్ చేయాలని రైల్వేబోర్డు అధికారులను ఆదేశించింది. (Railway Board orders)కోరమండల్ ఎక్స్ ప్రెస్ బాలాసోర్ వద్ద లూప్ లైనులోకి వెళ్లి ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొనడానికి సిగ్నలింగ్ వ్యవస్థే కీలకమని రైల్వే బోర్డు పేర్కొంది.

Bengal Governor summons state election commissioner: హింసాకాండపై బెంగాల్ గవర్నర్ సమన్లు జారీ

రైలు నియంత్రణ యంత్రాంగాలు, రిలే హట్స్ హౌసింగ్ సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్‌లతో కూడిన అన్ని రిలే గదులకు డబుల్ లాకింగ్(double locking of signalling) ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు ఆదేశించింది. రిలేరూంలోకి ఎవరైనా వెళితే సిగ్నలింగ్ లో జోక్యం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని, దీని వల్లనే కోరమండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లోనులోకి వెళ్లిందని రైల్వేబోర్డు పేర్కొంది.

Ladli Behna Yojana: మధ్యప్రదేశ్‌లో సీఎం చౌహాన్ ఎన్నికల తాయిలాలు..లాడ్లీ బెహనా యోజన పథకం

ఇంటర్ లాకింగ్ వ్యవస్థను లోపరహితంగా చేసేందుకే డబుల్ లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామని రైల్వే బోర్డు తెలిపింది. డబుల్ లాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసే వరకు ఇప్పుడున్న ఒక తాళాన్ని స్టేషన్ మాస్టర్ వద్ద భద్రపర్చాలని బోర్డు సూచించింది. లెవెల్-క్రాసింగ్‌ల పరికరాలు, పాయింట్, ట్రాక్ సర్క్యూట్ సిగ్నల్స్ వద్ద అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వే బోర్డు జారీ చేసిన ఆదేశాల్లో వివరించింది.