Ajith: ఓటీటీలో అజిత్ తెగింపు చూపెట్టేది ఆరోజేనా..?

తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తునివు’ పొంగల్ కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించారు. ఇక ఈ సినిమాలో అజిత్ సరికొత్త లుక్‌లో అల్ట్రా స్టైలిష్ స్వాగ్‌తో కనిపించిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. తునివు సినిమా రిలీజ్‌కు ముందే, ఈ చిత్ర టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Ajith: ఓటీటీలో అజిత్ తెగింపు చూపెట్టేది ఆరోజేనా..?

Ajith Thunivu OTT Release Date Locked

Ajith: తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తునివు’ పొంగల్ కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించారు. ఇక ఈ సినిమాలో అజిత్ సరికొత్త లుక్‌లో అల్ట్రా స్టైలిష్ స్వాగ్‌తో కనిపించిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. తునివు సినిమా రిలీజ్‌కు ముందే, ఈ చిత్ర టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. తునివు చిత్రాన్ని తెగింపు అనే టైటిల్‌తో తెలుగులోనూ రిలీజ్ చేశారు.

Ajith Kumar: 22 ఏళ్ల తరువాత అజిత్‌తో స్టార్ హీరోయిన్ రొమాన్స్..?

ఇక ఈ సినిమా రిలీజ్ రోజున మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. యాక్షన్ డోస్ ఎక్కువగా ఉన్న ఈ సినిమాలో అజిత్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆక్టుటకోవడంలో సక్సెస్ అయ్యింది. రొటీన్ కథ అయినా, సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి. అయితే ఈ సినిమాకు తమిళంలో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాకు వసూళ్లు కూడా బాగానే వచ్చాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Ajith: ‘వారసుడు’ని నెట్టుకుంటూ వస్తున్న అజిత్.. అర్ధరాత్రికే తెగింపు చూడనున్న ఫ్యాన్స్!

తునివు చిత్రానికి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 10 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ కానీ, నెట్‌ఫ్లిక్స్ కానీ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయలేదు. మరి నిజంగానే ఫిబ్రవరి 10న అజిత్ ఓటీటీలో తెగింపు చూపెడతాడా అనేది చూడాలి.