Akhilesh Yadav : లోక్‌స‌భ ఎంపీగా అఖిలేశ్ యాద‌వ్ రాజీనామా

Akhilesh Yadav : యూపీ ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Akhilesh Yadav : లోక్‌స‌భ ఎంపీగా అఖిలేశ్ యాద‌వ్ రాజీనామా

Samajwadi Party Chief Akhilesh Yadav Resigns From Lok Sabha After Being Elected As Up Mla

Akhilesh Yadav : యూపీ ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంగళవారం (మార్చి 22) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కార్యాలయానికి వెళ్లి తన రాజీనామా లేఖను అఖిలేశ్ సమర్పించారు. ఇటీవలే యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ కర్హాల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

ఈ ఎన్నికల్లో బీజేపీకి చెందిన ఎస్ పి సింగ్ బఘేల్ పై 60వేల కంటే ఎక్కువ ఓట్లతో గెలిచి అఖిలేశ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 403 స్థానాలు కలిగిన యూపీలో అఖిలేశ్ సమాజ్ వాదీ పార్టీ 111 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ సింగిల్ గా బరిలోకి దిగి 255 సీట్లను గెలిచి యూపీలో మళ్లీ అధికారాన్ని చేజిక్కిచ్చుకుంది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ 2019లో అజంగఢ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

గ‌త పార్లమెంట్ ఎన్నిక‌ల్లో ఆజామ్‌ఘ‌ర్ ఎంపీగా అఖిలేశ్ ఎన్నిక‌య్యారు. ఎంపీగా రాజీనామా చేసిన అఖిలేశ్ యూపీ సీఎం ఆదిత్య‌నాథ్‌ను అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు. 2017 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (BJP) దాని మిత్రపక్షాలు రాష్ట్రంలోని 403 అసెంబ్లీ నియోజకవర్గాలలో 312 గెలుచుకున్నాయి.

జాతీయ రాజ‌కీయాల‌పై కన్నా రాష్ట్ర రాజ‌కీయాల‌పైనే అఖిలేశ్ ఫోక‌స్ పెట్టారు. అందుకే లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి.. కొత్త‌గా ఎన్నికైన ఎమ్మెల్యే ప‌ద‌విలోనే కొన‌సాగాలని నిర్ణయించుకున్నారు. ఇక‌పై యూపీ అసెంబ్లీ స‌మావేశాల్లో యోగి సర్కారు, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాలో ఎస్పీ మ‌ధ్య హోరాహోరీ పోరు కొనసాగనుంది.

Read Also : UP: పేదరికంలోను..శిశుమరణాల్లో టాప్‌-3లో యూపీ..ఇది యోగి పాలన అంటూ అఖిలేశ్ యాదవ్ సెటైర్లు