Alia Bhatt: ఆర్ఆర్ఆర్‌పై అలియా అలక?.. అసలేం జరుగుతోంది?

బాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ అయినా.. సినిమాల విషయంలో, స్టార్ ఇమేజ్ విషయంలో మాత్రం సీనియర్ హీరోయిన్లను మించిపోతోంది ఆలియా. బాలీవుడ్, టాలీవుడ్ ఏ కాదు, ఏవుడ్ లో చూసినా అలియా భట్ పేరే..

Alia Bhatt: ఆర్ఆర్ఆర్‌పై అలియా అలక?.. అసలేం జరుగుతోంది?

Alia Bhatt

Alia Bhatt: బాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ అయినా.. సినిమాల విషయంలో, స్టార్ ఇమేజ్ విషయంలో మాత్రం సీనియర్ హీరోయిన్లను మించిపోతోంది ఆలియా. బాలీవుడ్, టాలీవుడ్ ఏ కాదు, ఏవుడ్ లో చూసినా అలియా భట్ పేరే వినిపిస్తోంది. మన టాలీవుడ్ లో అలియాభట్ తమ హీరోయిన్ కావాలనే స్టార్ హీరోల లిస్ట్ పెరిగిపోతోంది. సినిమాల విషయంలో సెలెక్టెడ్ గా ఉండే ఆలియా డిఫరెంట్ మూవీ స్ చేస్తూనే కెరీర్ లో ఫుల్ బిజీ అవుతోంది.

Alia Bhatt: మిర్చి ఘాటులా అలియా బోల్డ్ షూట్

ఇటీవలే ‘గంగూబాయి కతియావాడి’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన అలియా భట్.. ఆర్ఆర్ఆర్ తో కలిసి సీతగా కథను మలుపు తిప్పే పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాపీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొడుతూ పాత రికార్డుల పనిబట్టి కొత్త రికార్డులను సృష్టిస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా సీత పాత్రలో ఆలియా భట్ నటనకు మంచి మార్కులే వేశారు ఆడియెన్స్. అయితే ఈ సినిమా ఔట్‌పుట్‌తో హ్యాపీగా లేని అలియా ఆర్ఆర్ఆర్ మేకర్స్ పై అలకబూనిందని ప్రచారం జరుగుతుంది.

Alia Bhatt : హాలీవుడ్‌లోకి అలియా ఎంట్రీ..

సినిమాకి ముందు ప్రచారంలో కూడా పెద్దగా కలిసి కనిపించని అలియా.. సినిమా విడుదల తర్వాత కూడా సోషల్ మీడియాలో పెద్దగా సినిమాను ప్రస్తావించలేదు. తాజాగా సినిమా సక్సెస్ పార్టీలో కూడా ఆలియా కనిపించలేదు. దీంతో పలు అనుమానాలు వినిపించాయి. ఇన్ స్టాగ్రామ్ లో కూడా అలియా రాజమౌళిని అన్ ఫాలో చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలానే ఆర్ఆర్ఆర్ కి సంబంధించిన కొన్ని పోస్టులను తొలగించిందని రూమర్స్ వినిపించాయి.

RRR: జక్కన్నను అన్‌ఫాలో చేసిన హీరోయిన్?

అయితే.. అంతలోనే ఆర్ఆర్ఆర్ మూడు రోజుల్లో 500 కోట్లు కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందని మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ను అలియా షేర్ చేసింది. దీంతో అసలు ఏం జరుగుతుంది.. అలియా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందని ఆమె అభిమానులు అర్ధం కాక జుట్టు పీక్కుంటున్నారు. ఒకవైపు సినిమా గురించి మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడని అలియా సినిమా కలెక్షన్లను మాత్రం ప్రస్తావించడంతో ఆమె అయోమయంలో ఉందా.. లేక తాము అయోమయంలో ఉన్నామా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.