Alia Bhatt : ప్రెగ్నెన్సీతో ఎడారిలో యాక్షన్ సీన్స్.. అలియాభట్ షూటింగ్ పిక్స్ లీక్..

ఇటీవలే హాలీవుడ్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న అలియా దాని గురించి ట్విట్టర్ లో పోస్టులు కూడా చేసింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని షూటింగ్ పిక్స్ లీక్ అయ్యాయి. హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌ సినిమా.............

Alia Bhatt : ప్రెగ్నెన్సీతో ఎడారిలో యాక్షన్ సీన్స్.. అలియాభట్ షూటింగ్ పిక్స్ లీక్..

Alia Bhatt

Alia Bhatt :  గత కొన్నేళ్లుగా డేటింగ్ చేసుకొని, ప్రేమించి ఇటీవలే ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నారు బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ రణబీర్ కపూర్, అలియా భట్. పెళ్లయిన 2 నెలలకే ఆలియా ప్రెగ్నెన్సీని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కానీ ప్రెగ్నెన్సీ కారణంగా షూటింగ్‌లకు బ్రేక్‌ ఇవ్వకుండా కమిట్‌మెంట్‌ ఇచ్చిన సినిమాలు చేసేస్తోంది అలియా భట్‌. అలియా హాలీవుడ్‌ లో ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ అనే ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవలే హాలీవుడ్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న అలియా దాని గురించి ట్విట్టర్ లో పోస్టులు కూడా చేసింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని షూటింగ్ పిక్స్ లీక్ అయ్యాయి. హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌ సినిమా షూటింగ్ పోర్చుగల్ ఎడారుల్లో జరిగింది. అలియా, హాలీవుడ్ హీరోయిన్ గాల్‌ గాడోట్‌ పై కొన్ని సన్నివేశాలని తెరకెక్కించారు. ఈ షూటింగ్ కి సంబంధించిన పిక్స్ కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలలో అలియా భట్‌ బేబీ బంప్‌ స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత కవర్ చేయాలని చూసినా ఇందులో తన బేబీ బంప్ కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఇలా సినిమా మీద ప్రేమతో యాక్షన్ సీన్స్ చేస్తుందని హ్యాట్సాఫ్ అంటున్నారు మరికొంతమంది.

Gaurav Taneja : బర్త్‌డే పార్టీ చేసుకున్నందుకు.. ఫేమస్ యూట్యూబర్ అరెస్ట్..

ఇక ఇటీవలే షూటింగ్ నుంచి తిరిగొచ్చింది అలియా. ప్రెగ్నెన్సీ కారణంగా ప్రస్తుతానికి సినిమాలకి గ్యాప్ ఇవ్వబోతుందని తెలుస్తోంది.