Gaurav Taneja : బర్త్‌డే పార్టీ చేసుకున్నందుకు.. ఫేమస్ యూట్యూబర్ అరెస్ట్..

యూపీకి చెందిన యూట్యూబర్ గౌరవ్ తనేజా అక్కడ ఫేమస్ యూట్యూబర్. అతనికి 'ఫ్లయింగ్ బీస్ట్', 'ఫిట్ మజిల్ టీవీ', 'రాస్‌భారీ కే పాపా' అనే మూడు ఛానల్స్ ఉన్నాయి. వీటిల్లో.............

Gaurav Taneja : బర్త్‌డే పార్టీ చేసుకున్నందుకు.. ఫేమస్ యూట్యూబర్ అరెస్ట్..

Gaurav Taneja

Gaurav Taneja :  ఉత్తరప్రదేశ్ కి చెందిన ఫేమస్ యూట్యూబర్ గౌరవ్ తనేజా శనివారం అరెస్ట్ అయ్యారు. యూపీకి చెందిన యూట్యూబర్ గౌరవ్ తనేజా అక్కడ ఫేమస్ యూట్యూబర్. అతనికి ‘ఫ్లయింగ్ బీస్ట్’, ‘ఫిట్ మజిల్ టీవీ’, ‘రాస్‌భారీ కే పాపా’ అనే మూడు ఛానల్స్ ఉన్నాయి. వీటిల్లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. అతని ఇన్‌స్టాగ్రామ్ లో కూడా మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే గౌరవ్ తనేజా తన పుట్టినరోజును నోయిడాలోని సెక్టార్ 51 మెట్రో స్టేషన్‌లో జరుపుకోవాలని అనుకున్నాడు.

దీంతో గౌరవ్ తనేజా మెట్రో స్టేషన్ కి సంబంధించి పర్మిషన్ కూడా తీసుకున్నాడు. కేవలం అతి కొద్ది మందితో మాత్రమే ఈ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటాను అని పర్మిషన్ తీసుకున్నాడు. యూపీలో కరోనా దృష్ట్యా ఎక్కువ మంది గుమిగూడటానికి వీలు లేదు. కానీ తన పుట్టిన రోజు గురించి గౌరవ్ తనేజా తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ నోయిడా సెక్టార్ 51 మెట్రో స్టేషన్ దగ్గర నా పుట్టిన రోజు జరుపుకుంటున్నాము అని తెలిపాడు. తన భార్య రీతూ కూడా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి తన భర్త పుట్టిన రోజు వేడుకలకి అభిమానులని రమ్మంది.

Nagarjuna : ప్రేక్షకులు ఏ సినిమాని హిట్ చేస్తారో ఇప్పటికి అర్ధం కాదు.. ఏది హిట్ అవుద్దో, ఏది ఫ్లాప్ అవుద్దో చెప్పలేం..

ఇంకేముంది.. యూట్యూబర్ గౌరవ్ తనేజా పుట్టినరోజును జరుపుకోవడానికి అతని అభిమానులు మెట్రో స్టేషన్‌ వద్ద గుమిగూడారు. వేలల్లో జనాలు వచ్చారు. వేలాది మంది ప్రజలు రావడంతో తొక్కిసలాట కూడా జరిగింది. ఇంతమంది జనాలకి ఎటువంటి అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించినందుకు, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు, పోలీసులు జారీ చేసిన ఆర్డర్స్ ని లెక్కచేయనందుకు నోయిడా పోలీసులు గౌరవ్ ని అరెస్ట్ చేశారు. గౌరవ్ అభిమానులు అతన్ని రిలీజ్ చేయాలని సోషల్ మీడియాలో కామెంట్స్, పోస్టులు చేస్తున్నారు.