Uttar Pradesh: యాత్ర చేస్తున్న శివ భక్తులకు బీర్లు పంచిన వ్యక్తి.. అరెస్టు చేసిన పోలీసులు

ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన ఎందరో శివ భక్తులు మహా శివరాత్రి సందర్భంగా కన్వర్ యాత్ర చేస్తారు. అంటే గంగోత్రి, గోముఖ్, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాల్ని దర్శించుకుంటారు. పాదయాత్ర చేస్తూ ఆయా దేవాలయాలకు తరలివెళ్తారు.

Uttar Pradesh: యాత్ర చేస్తున్న శివ భక్తులకు బీర్లు పంచిన వ్యక్తి.. అరెస్టు చేసిన పోలీసులు

Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్, అలీఘడ్‌లో అభ్యంతరకర ఘటన జరిగింది. ఎంతో పవిత్రమైన కన్వర్ యాత్ర చేస్తున్న శివ భక్తులకు ఒక వ్యక్తి బీర్లు పంచేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. బీర్లు పంచిన వ్యక్తిని అరెస్టు చేశారు.

Youngest Organ Donor: తండ్రి కోసం పదిహేడేళ్ల కూతురు త్యాగం.. అతి చిన్న వయసులో లివర్ దానం.. అరుదైన రికార్డు

ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన ఎందరో శివ భక్తులు మహా శివరాత్రి సందర్భంగా కన్వర్ యాత్ర చేస్తారు. అంటే గంగోత్రి, గోముఖ్, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాల్ని దర్శించుకుంటారు. పాదయాత్ర చేస్తూ ఆయా దేవాలయాలకు తరలివెళ్తారు. ఈ యాత్ర ఎంతో పవిత్రంగా, సంప్రదాయబద్ధంగా సాగుతుంది. ఈ యాత్ర చేసే వాళ్లను కన్వరియన్స్ అంటారు. వీళ్లు కన్వర్ యాత్ర చేస్తూ, నడుచుకుంటూ వెళ్తుండగా అలీఘడ్‌లో యోగేష్ అనే వ్యక్తి రోడ్డుపై బైక్ ఆపి, వారికి బీర్ క్యాన్లు పంచాడు. భారీ సంఖ్యలో బీర్లు తెచ్చి, ఇచ్చేందుకు ప్రయత్నించాడు.

Viral Video: నిజమైన భార్యాభర్తల బంధం అంటే ఇదే.. వైరల్ అవుతున్న వృద్ధ దంపతుల వీడియో

అయితే, భక్తులు వీటిని తీసుకోకుండానే వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పవిత్రమైన యాత్ర చేస్తున్న వాళ్లకు బీర్లు పంచడంపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు స్పందించారు. యోగేష్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అంతే కాకుండా బీర్లు అమ్మిన వైన్స్ షాపుపై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఒకే వ్యక్తికి అన్ని బీర్లు అమ్మడం చట్ట ప్రకారం నేరం. ఈ కారణంగా బీర్లు విక్రయించిన వారిపై కూడా ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.