Allari Naresh: కొత్త రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకున్న అల్లరి నరేశ్ ‘ఉగ్రం’

టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉగ్రం’ తొలుత ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ, ఇప్పుడు ఈ సినిమాను మే 5న రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు.

Allari Naresh: కొత్త రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకున్న అల్లరి నరేశ్ ‘ఉగ్రం’

Allari Naresh Ugram Movie Gets New Release Date

Updated On : April 3, 2023 / 6:50 PM IST

Allari Naresh: టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉగ్రం’ ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. వరుసగా సీరియస్ మూవీలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ హీరో, ఇప్పుడు మరోసారి నాంది కాంబినేషన్‌తో వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్న ఈ కాప్ యాక్షన్ డ్రామాలో అల్లరి నరేశ్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.

Allari Naresh: రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న అల్లరి నరేశ్ ‘ఉగ్రం’!

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. కాగా, ఈ సినిమాను తొలుత ఏప్రిల్ 14న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మార్చారు. ఈ సినిమాను వేసవి కానుకగా మే 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఇప్పుడు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగిపోయింది.

Ugram Movie: ఉగ్రం ఫస్ట్ సింగిల్ సాంగ్ అనౌన్స్‌మెంట్‌ను తీసుకొస్తున్న అల్లరి నరేష్

ఈ సినిమాలో అల్లరి నరేశ్ పాత్ర అల్టిమేట్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో మలయాళ భామ మిర్నా హీరోయిన్‌గా నటిస్తోండగా, శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఉగ్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.