Ugram Movie: ఉగ్రం ఫస్ట్ సింగిల్ సాంగ్ అనౌన్స్‌మెంట్‌ను తీసుకొస్తున్న అల్లరి నరేష్

కామెడీ హీరో నుండి సీరియస్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టకుంటున్న యంగ్ హీరో అల్లరి నరేష్, తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఉగ్రం’. దర్శకుడు విజయ్ కనకమేడల డైరెక్షన్‌లో ‘నాంది’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత మరోసారి నరేష్ నటిస్తున్న సినిమా కావడంతో, ‘ఉగ్రం’పై కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

Ugram Movie: ఉగ్రం ఫస్ట్ సింగిల్ సాంగ్ అనౌన్స్‌మెంట్‌ను తీసుకొస్తున్న అల్లరి నరేష్

Allari Naresh Ugram Movie First Single Announcement

Updated On : March 17, 2023 / 2:05 PM IST

Ugram Movie: కామెడీ హీరో నుండి సీరియస్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టకుంటున్న యంగ్ హీరో అల్లరి నరేష్, తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఉగ్రం’. దర్శకుడు విజయ్ కనకమేడల డైరెక్షన్‌లో ‘నాంది’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత మరోసారి నరేష్ నటిస్తున్న సినిమా కావడంతో, ‘ఉగ్రం’పై కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

Ugram Teaser: అల్లరి నరేశ్ ఉగ్రరూపం.. మామూలుగా లేదుగా!

ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్‌లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా వేసవి కానుకగా ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసింది సినిమా యూనిట్. ఈ సందర్భంగా ‘ఉగ్రం’ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ కానుందా అనే అనౌన్స్‌మెంట్‌ను ఇవాళ సాయంత్ర 4.05 గంటలకు చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్.

Ugram: ఉగ్రం.. మొదలుపెట్టిన అల్లరి నరేష్!

ఈ సినిమాలో నరేష్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, మిర్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, షైన్ స్క్రీన్స్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. మరి ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.