Allu Arjun: మరో యాడ్ షూటింగ్‌లో బిజీగా బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ ‘పుష్ప-2’ కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకపోవడంతో, ఈ గ్యాప్‌లో వరుసగా యాడ్ షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నాడు బన్నీ.

Allu Arjun: మరో యాడ్ షూటింగ్‌లో బిజీగా బన్నీ
ad

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మూవీ పుష్ప 2 కోసం రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ మరోసారి అల్ట్రా మాస్ మూవీగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే, బన్నీ వరుసబెట్టి యాడ్ షూటింగ్స్ చేస్తూ ఇండస్ట్రీలో సందడి చేస్తున్నాడు. ఇటీవల బ్యాంకాక్‌లో ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొని వచ్చిన బన్నీ, రీసెంట్‌గా హైదరాబాద్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో కూడా ఓ యాడ్ షూటింగ్ కంప్లీట్ చేశాడు.

Allu Arjun: త్రివిక్రమ్‌తో బన్నీ సైలెంట్‌గా కానిచ్చేశాడు!

అయితే బన్నీ పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటంతో, తాజాగా ఓ పైపుల కంపెనీకి సంబంధించిన యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ యాడ్ షూటింగ్‌ను స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్ట్ చేయగా, పాపులర్ సినిమాటోగ్రఫర్ సుదీప్ ఛటర్జీ ఈ యాడ్‌ను తన కెమెరాలో బంధించారు. ఇక ఈ యాడ్ షూటింగ్ స్పాట్ నుండి రిలీజ్ అయిన కొన్ని స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

Allu Arjun : ఐకాన్ స్టార్ ఒక్క ఫొటోతో.. ‘పుష్ప’పై ఎన్నో అనుమానాలు..

ఇలా వరుసగా యాడ్ షూటింగ్‌లలో పాల్గొంటూ బన్నీ తన అభిమానులను బుల్లితెరపై ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక పుష్ప-2 సినిమాను త్వరలోనే పట్టాలెక్కించి, పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని బన్నీ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండగా, అందాల భామ రష్మిక మందన మరోసారి బన్నీతో రొమాన్స్‌కు రెడీ అవుతోంది.