Vishwaksen : విశ్వక్ సినిమాలో స్పెషల్ రోల్ చేయబోతున్న ఐకాన్ స్టార్

తమిళ్ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో విజయ్ సేతుపతి కనిపిస్తాడు. తెలుగులో ఈ పాత్రకి చాలా మంది పెద్ద హీరోలని అడిగినట్టు, చివరికి..

Vishwaksen : విశ్వక్ సినిమాలో స్పెషల్ రోల్ చేయబోతున్న ఐకాన్ స్టార్

Ohmy

Vishwaksen :  యువ నటుడు విశ్వక్‌ సేన్‌ తన మాస్ యాటిట్యూడ్ తో ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. తన మొదటి సినిమా ఎవరికీ తెలియకపోయినా తన రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. తర్వాత ‘ఫలక్ నామా దాస్’ సినిమాతో మాస్ హిట్ కొట్టాడు. తర్వాత ‘హిట్’ సినిమాతో మంచి విజయం అందుకొని ఇటీవల ‘పాగల్’ మూవీతో కూడా సక్సెస్ సాధించాడు. ఇలా వరుసగా సినిమాలు హిట్ కొడుతూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే మరో నాలుగైదు సినిమాలు కూడా లైన్లో పెట్టేసాడు. తమిళ్ లో మంచి విజయం సాధించిన ‘ఓ మై కడవులే’ సినిమాని తెలుగులో విశ్వక్ రీమేక్ చేస్తున్నాడు.

MAA Elections : తెలంగాణ నినాదంతో ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్న సీనియర్ నటుడు..

ఈ సినిమాను పివిపి సినిమా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే తమిళ్ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో విజయ్ సేతుపతి కనిపిస్తాడు. తెలుగులో ఈ పాత్రకి చాలా మంది పెద్ద హీరోలని అడిగినట్టు, చివరికి అల్లుఅర్జున్ ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడని సమాచారం. సినిమాలో రెండు సార్లు ఆ స్పెషల్ క్యారెక్టర్ కనిపిస్తుంది. 10 నిమిషాలకు పైగా ఈ పాత్ర ఉంటుంది. ఇప్పుడు తెలుగులో ఈ పాత్రని అల్లు అర్జున్ చేస్తున్నాడని సమాచారం. ఇదే నిజమైతే ఈ సినిమాకి మరింత హైప్ వచ్చినట్టే. తమిళ్ లో ఈ సినిమాని డైరెక్ట్ చేసిన అశ్వత్ మారిముత్తు తెలుగులో కూడా తనే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టింది. కుదిరితే డిసెంబర్ లేదా ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజ్ చేయాలి అనే ప్లాన్ లో ఉన్నారు మూవీ మేకర్స్.