Amazon Air Service in India : భారత్‌కు అమెజాన్ ఎయిర్ సర్వీసు వచ్చేసిందోచ్.. ఆర్డర్ చేయడమే ఆలస్యం.. అత్యంత వేగంగా డెలివరీ..!

Amazon Air Service in India : భారతీయ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Users) వినియోగదారులకు శుభవార్త.. దేశంలో అమెజాన్ ఇండియా ప్లాట్ ఫారమ్ ద్వారా ఏదైనా ఆర్డర్ చేస్తే అత్యంత వేగంగా డెలివరీ కానుంది. ఇందుకోసం అమెజాన్ భారత మార్కెట్లో కొత్త డెలివరీ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది.

Amazon Air Service in India : భారత్‌కు అమెజాన్ ఎయిర్ సర్వీసు వచ్చేసిందోచ్.. ఆర్డర్ చేయడమే ఆలస్యం.. అత్యంత వేగంగా డెలివరీ..!

Amazon launches its Air service in India, here is all you need to know

Amazon Air Service in India : భారతీయ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Users) వినియోగదారులకు శుభవార్త.. దేశంలో అమెజాన్ ఇండియా ప్లాట్ ఫారమ్ ద్వారా ఏదైనా ఆర్డర్ చేస్తే అత్యంత వేగంగా డెలివరీ కానుంది. ఇందుకోసం అమెజాన్ భారత మార్కెట్లో కొత్త డెలివరీ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే.. అమెజాన్ ఎయిర్ సర్వీసు (Amazon Air Sevices). ఈ అమెజాన్ ఎయిర్ సర్వీసుల ద్వారా వినియోగదారులకు వేగంగా డెలివరీని అందించడానికి సాయపడుతుంది.

రిటైలర్ బెంగళూరుకు చెందిన కార్గో ఎయిర్‌లైన్ క్విక్‌జెట్‌ (cargo airline Quikjet)తో భాగస్వామ్యాన్ని అమెజాన్ కుదుర్చుకుంది. ఈ కంపెనీ భాగస్వామ్యంతో దేశంలో అమెజాన్ సొంత ఎయిర్ ఫ్రైట్ సర్వీసును ప్రారంభించింది. ఎయిర్ సర్వీసుల ద్వారా చాలా వేగంగా వస్తువులను డెలివరీ చేసేందుకు వీలు కల్పిస్తుందని అమెజాన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

టెక్ దిగ్గజం తన కార్గో సర్వీసును ప్రారంభించిన మొదటి మార్కెట్ భారత్ కాదు. అమెజాన్ కార్గో ఎయిర్‌క్రాఫ్ట్ సర్వీసులను పొందుతున్న మార్కెట్లలో భారత్ మూడోవది. అమెజాన్ ఎయిర్ మొదటిసారిగా 2016లో అమెరికా మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత యూరప్‌కు కూడా అందుబాటులోకి వచ్చింది. భారతీయ మార్కెట్‌లో రెండు కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రతి ఒక్కటి 20వేల ప్యాకేజీలను అందించగలదని టెక్ క్రంచ్ నివేదిక తెలిపింది. అమెజాన్ ఎయిర్ సర్వీసు భారత మార్కెట్లోకి అడుగుపెడుతోంది.

Amazon Airలో పెట్టుబడుల ద్వారా భారత్‌లో కస్టమర్‌లకు డెలివరీ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, ఈ సర్వీసు ద్వారా భారత్‌లోని 1.1 మిలియన్లకు పైగా అమ్మకందారులకు సపోర్టు అందిస్తుంది. రవాణాతో పాటు విమానయానం వంటి అనుబంధ వ్యాపారాల వృద్ధికి మరింత వీలు కల్పిస్తుందని అమెజాన్‌లో కస్టమర్ ఫుల్‌ఫిల్‌మెంట్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా చెప్పారు. అమెజాన్ డెలివరీ సర్వీసు కోసం బోయింగ్ 737-800 విమానాన్ని వినియోగించుకుంటుంది.

Amazon launches its Air service in India, here is all you need to know

Amazon launches its Air service in India, here is all you need to know

Read Also : Airtel Free OTT Plans : ఎయిర్‌టెల్ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. ఫ్రీగా OTT సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు.. పూర్తి వివరాలు మీకోసం..!

కంపెనీ అందించిన వివరాల ప్రకారం.. క్విక్‌జెట్ కార్గో ఎయిర్‌లైన్స్ ద్వారా ఈ సర్వీసులను అందించనుంది. అమెజాన్-బ్రాండెడ్ విమానం హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు కస్టమర్ షిప్‌మెంట్‌లను రవాణా చేస్తుంది. భారత్‌లో అత్యంత వేగంగా డెలివరీలను అందించడమే కాకుండా ఖర్చులను కూడా ఆదా చేస్తుందని కంపెనీ తెలిపింది. అమెజాన్ గ్లోబల్ ఎయిర్ వైస్ ప్రెసిడెంట్, సారా రోడ్స్ మాట్లాడుతూ.. పెరుగుతున్న కస్టమర్ బేస్‌ ఆధారంగా తక్కువ ధరలు, వేగవంతమైన డెలివరీలతో అందించడమే లక్ష్యంగా ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు.

భారత్‌లో Amazon Air సర్వీసులను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎయిర్ కార్గో సర్వీసులో ప్రస్తుతం ప్రపంచంలోని 70 గమ్యస్థానాలలో 110కి పైగా విమానాలు ఉన్నాయని, ఇందుకోసం అమెజాన్ వందల మిలియన్ డాలర్లను ఎయిర్ లాజిస్టిక్స్ కోసం వెచ్చించిందని కంపెనీ వెల్లడించింది.

Amazon launches its Air service in India, here is all you need to know

Amazon launches its Air service in India, here is all you need to know

అంతేకాకుండా, అమెజాన్ ఇటీవల 18వేల మంది ఉద్యోగుల తొలగింపును ప్రకటించింది. దాంతో చాలా మందిని నిరాశపరిచింది. గత 6 నెలలుగా టెక్ పరిశ్రమలో ఉద్యోగుల తొలగింపులు పెరుగుతున్నాయి. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) కూడా 12వేల మంది ఉద్యోగులను తొలగించింది. అలాగే, మైక్రోసాఫ్ట్ (Microsoft) తన హెడ్‌కౌంట్లను 10,000 తగ్గించింది. మెటా వంటి ఇతర కంపెనీలు 11వేల మందిని తొలగించేందుకు తమ ప్లాన్లను ప్రకటించాయి. అనేక టెక్ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. బాధిత ఉద్యోగులను తొలగించిందుకు వారికి వేతనాన్ని కూడా అందజేస్తామని హామీ ఇచ్చాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Group Admins : ఆపిల్ ఐఫోన్లలో వాట్సాప్ గ్రూపు అడ్మిన్ల కోసం కొత్త షార్ట్‌కట్స్.. ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి!