New China Ambassador : చైనాలో భారత రాయబారిగా ప్ర‌దీప్ కుమార్ రావ‌త్ నియామకం

సీనియ‌ర్ దౌత్యాధికారి ప్ర‌దీప్ కుమార్ రావ‌త్..చైనాలో భార‌త తదుపరి రాయ‌బారిగా నియ‌మితుల‌య్యారు. భార‌త విదేశాంగ శాఖ ఈ మేర‌కు సోమ‌వారం ఒక ప్ర‌క‌టన విడుద‌ల చేసింది. 1990 బ్యాచ్‌కు

New China Ambassador : చైనాలో భారత రాయబారిగా ప్ర‌దీప్ కుమార్ రావ‌త్ నియామకం

Pradep

Updated On : December 20, 2021 / 5:43 PM IST

New China Ambassador : సీనియ‌ర్ దౌత్యాధికారి ప్ర‌దీప్ కుమార్ రావ‌త్..చైనాలో భార‌త తదుపరి రాయ‌బారిగా నియ‌మితుల‌య్యారు. భార‌త విదేశాంగ శాఖ ఈ మేర‌కు సోమ‌వారం ఒక ప్ర‌క‌టన విడుద‌ల చేసింది. 1990 బ్యాచ్‌కు చెందిన IFS అధికారి ప్ర‌దీప్ రావ‌త్‌.. ప్ర‌స్తుతం నెద‌ర్లాండ్‌లో భారత రాయ‌బారిగా ప‌నిచేస్తున్నారు. తాజాగా ఆయ‌న‌ను చైనాలో రాయ‌బారిగా నియ‌మించినందున త్వ‌ర‌లో బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నట్లు విదేశాంగశాఖ ఆ ప్రకటనలో తెలిపింది.

ప్ర‌స్తుతం చైనా రాయబారిగా విక్ర‌మ్ మిస్రీ ప‌నిచేస్తున్నారు. ఆయ‌న నుంచి ప్ర‌దీప్ రావ‌త్ బాధ్య‌త‌లు తీసుకోనున్నారు. ప్ర‌దీప్ రావ‌త్‌..చైనా భాష‌ను అన‌ర్గ‌లంగా మాట్లాడ‌గ‌ల‌రు. తూర్పు ల‌ఢ‌ఖ్‌ లో ఉద్రిక్త ప‌రిస్థితుల న‌డుమ ప్ర‌దీప్ రావ‌త్ చైనాలో భార‌త రాయ‌బారిగా బాధ్య‌త‌లు చేప‌డుతున్నారు . కాగా ప్రదీప్ రావ‌త్ గ‌తంలో హాంకాంగ్, బీజింగ్‌ల‌లో దౌత్యాధికారిగా కూడా ప‌నిచేశారు.

ALSO READ Aishwarya Rai : పనామా పేపర్స్ కేసు.. ఈడీ ముందు హాజరైన బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్​