Amit Shah: ఎట్టకేలకు అదానీ వ్యవహారంపై స్పందించిన అమిత్ షా

అదానీ గ్రూప్ స్టాక్ మానిపులేషన్ తదితర అక్రమాలకు పాల్పడిందని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనే సంస్థ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో అదానీ గ్రూప్ సంపద పెద్ద ఎత్తున ఆవిరి అయిపోయింది. నెల రోజుల వ్యవధిలో అదానీ సగానికి పైగా ఆస్తులు తరిగిపోయాయి. ఇక దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ చేత దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్, తదితర విపక్షాలు పార్లమెంటులో డిమాండ్ చేస్తున్నాయి.

Amit Shah: ఎట్టకేలకు అదానీ వ్యవహారంపై స్పందించిన అమిత్ షా

Amit Shah responds to Adani-Hindenburg row

Amit Shah: కొంత కాలంగా దేశాన్ని కుదిపివేస్తున్న అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎట్టకేలకు స్పందించారు. ఈ వివాదంపై సుప్రీంకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసిందని, దీనికి సంబంధించిన ఆధారాలు, రుజువులు ఉన్నవారు ఈ కమిటీకి సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఇండియా టుడే ఆధ్వర్యంలో జరిగిన కాంక్లేవ్‌లో ఆయన పాల్గొన్నారు. ఆ సందర్భంలోనే ఆయనను దీనిపై ప్రశ్నించగా పై విధంగా సమాధానం చెప్పారు.

Manish Kashyap: తమిళనాడులో బిహారీలను హింసిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం.. పోలీసుల ముందు లొంగిపోయిన నిందితుడు మనీశ్ కశ్యప్

‘‘తప్పు ఎవరు చేసినా వదిలిపెట్టేది లేదు. న్యాయ వ్యవస్థ ప్రక్రియపై అందరికీ నమ్మకం ఉండాలి. నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు. అలా చేసినా, అవి ఎంతో కాలం నిలబడవు. అదానీ వివాదంపై దర్యాప్తు జరుపుతున్నట్లు అఫిడవిట్ ద్వారా సుప్రీంకోర్టుకు సెబీ తెలిపింది. ఈ దర్యాప్తును కొనసాగించాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏక కాలంలో రెండు దర్యాప్తులు జరుగుతున్నాయి’’ అని అన్నారు. అదానీ గ్రూప్‌పై దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆరుగురు నిపుణులతో ఓ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే, నందన్ నీలేకని, జస్టిస్ జే పీ దేవధర్, సోమశేఖర్ సుందరేశన్, ఓం ప్రకాశ్ భట్, కేవీ కామత్ ఉన్నారు.

Himachal Pradesh: ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు బంపరాఫర్.. ఏకంగా రూ.50 లక్షల సబ్సిడీ