Anasuya : భర్తతో లిప్‌కిస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ.. మాల్దీవ్స్‌లో భర్తతో కలిసి అనసూయ పెళ్లి రోజు..

జూన్ 4న తన మ్యారేజ్ డే కావడంతో అక్కడి బీచ్ లలో తన భర్త సుశాంక్‌ భరద్వాజ్‌ తో సందడి చేస్తూ ఉన్న ఫోటోలని, వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన భర్తతో కలిసి సముద్రంలో..........

Anasuya : భర్తతో లిప్‌కిస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ.. మాల్దీవ్స్‌లో భర్తతో కలిసి అనసూయ పెళ్లి రోజు..

Anasuya

Anasuya :  యాంకర్ అనసూయ అటు టీవీ షోలతో పాటు ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇక తన గ్లామర్ షో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో కూడా తన హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా అనసూయ తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ కి వెళ్ళింది. తన పెళ్లి రోజు కావడంతో భర్తతో సరదాగా ఎంజాయ్ చేసేందుకు అనసూయ మాల్దీవ్స్ కి వెళ్ళింది. ఇటీవల మాల్దీవ్స్ లో ఫోటోలు షేర్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా జూన్ 4న తన మ్యారేజ్ డే కావడంతో అక్కడి బీచ్ లలో తన భర్త సుశాంక్‌ భరద్వాజ్‌ తో సందడి చేస్తూ ఉన్న ఫోటోలని, వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన భర్తతో కలిసి సముద్రంలో, బీచ్ లో ఆడుకుంటున్న వీడియోలు, భర్తతో కలిసి ప్రేమగా కౌగలించుకొని, లిప్ లాక్ ఇచ్చి, రొమాంటిక్ ఫోజులతో ఫోటోలని షేర్ చేసింది.

Deepthi Sunaina : మోడ్రన్ డ్రెస్ లో దీప్తి సునైనా సొగసు చూడతరమా..

ఈ వీడియోని అనసూయ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి.. ” డియర్ నిక్కూ.. మనం ఎక్కడ కలిసి ఉంటే అదే నా అద్భుతమైన ప్రదేశం. నువ్ నా పక్కన ఉంటే చాలు. నా చేయి పట్టుకుంటే చాలు, మరో చేత్తో ప్రపంచాన్ని గెలుస్తాను. ఇన్నేళ్ల మన లవ్ జర్నీలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. మన పరిచయం అయి 21 ఏళ్ళు, మన పెళ్లి అయి 12 ఏళ్ళు రోజు రోజుకి మన ఏజ్ పెరిగినా నీ మీద ప్రేమ పెరుగుతూనే ఉంటుంది” అని ఎమోషనల్ గా పోస్ట్ చేసింది.