Ram Charan: చరణ్ సరసన తెలుగు బ్యూటీ…?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఈ సినిమా రిలీజ్ కావడంతో.....

Ram Charan: చరణ్ సరసన తెలుగు బ్యూటీ…?

Anjali To Romance Ram Charan In Shankar Movie

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఈ సినిమా రిలీజ్ కావడంతో, ఇప్పుడు ఆయన తన నెక్ట్స్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ తన కెరీర్‌లోని 15వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Ram Charan: శంకర్ సినిమాలో చరణ్ పాత్ర అదేనా..?

అయితే ఈ సినిమాలో చరణ్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారట. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని ఇప్పటికే ఒక హీరోయిన్‌గా చిత్ర యూనిట్ సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో చరణ్ తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమాలో చరణ్ సైకిల్‌పై వెళ్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయిన సంగతి తెలిసిందే. అది తండ్రి చరణ్ పాత్రకు సంబంధించిన ఫోటో అని చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే ఈ పాత్రకు జోడీగా తెలుగు బ్యూటీ అంజలి నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Ram Charan : శంకర్ సినిమా నుంచి చరణ్ లుక్ లీక్.. పంచెకట్టుతో సైకిల్ పై..

ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన అఫీషియల్ పోస్టర్‌లోని క్యాస్టింగ్‌లో అంజలి కూడా మనకు కనిపించింది. ఇప్పుడు అంజలి పాత్రపై ఓ క్లారిటీ వచ్చిందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. తండ్రి చరణ్ పాత్రకు జోడీగా అంజలి పర్ఫార్మెన్స్ కూడా సూపర్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రస్తుతం అమృత్‌సర్‌లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.