Ram Charan: శంకర్ సినిమాలో చరణ్ పాత్ర అదేనా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యి అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్....

Ram Charan: శంకర్ సినిమాలో చరణ్ పాత్ర అదేనా..?

Ram Charan To Play College Student In Shankar Movie

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యి అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, మరో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, చరణ్ తన నెక్ట్స్ చిత్రాన్ని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ తన 15వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తాజాగా అమృత్‌సర్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

Ram Charan : శంకర్ సినిమా నుంచి చరణ్ లుక్ లీక్.. పంచెకట్టుతో సైకిల్ పై..

కాగా తాజాగా ఈ సినిమాలో చరణ్ లుక్ ఒకటి లీకయ్యి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ సినిమాలో చరణ్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా లాంఛ్ పోస్టర్‌ను చూసి ఆయన ఈ చిత్రంలో ఓ ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నాడని అందరూ ఆనుకున్నారు. కానీ తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో చరణ్ ఓ కాలేజీ స్టూడెంట్ పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది. తాజాగా అమృత్సర్ ప్రారంతంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.

Ram Charan: చెర్రీ వేరియేషన్స్.. శంకర్ కోసం నాలుగు గెటప్స్?

అయితే ఇక్కడ కొన్ని కాలేజీకి సంబంధించిన సీన్స్‌ను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తునన్నట్లు తెలుస్తోంది. ఈ షూటింగ్ లో‌చరణ్, కియారా అద్వానీ, వెన్నెల కిషోర్, నవీన్ చంద్ర, ప్రియదర్శి తదితరులపై ఈ షెడ్యూల్ను ప్లాన్ చేశాట. అయితే దీనికి సంబంధిం, అధికారిక ప్రకన రావాల్సి ఉంది. ఏదేమైనా ఈ సినిమాలో చరణ్ స్టూడెంట్ పాత్ర అనగానే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక తాజాగా ఈ సినిమాలో చరణ ఓ సైకిల్‌పై వెళ్తున్న స్టిల్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నాడు.